'శిరీషను ఒకరిద్దరు లొంగదీసుకోవడం అయ్యే పనికాదు.. ఇంకెవరో ఉన్నారు!?'

ఆరడగుల మనిషి ఫ్యాన్ కు ఉరేసుకుంటే.. కనీసం ఫ్యాన్ రెక్కలయినా వంగవా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. శిరీష ప్యాంట్, షర్ట్ ధరించిందని.. అలాంటప్పుడు చున్నీ ఎక్కడి నుంచి వచ్చిందని ఆమె నిలదీశా

హైదరాబాద్: ఒక అనుమానాస్పద మృతి చుట్టూ.. పదుల కొద్ది అనుమానాలు.. హత్యా? ఆత్మహత్యా? అన్న సంశయాలు. గత రెండు వారాలుగా బ్యుటీషియన్ శిరీష మృతి చుట్టూ ఎన్నెన్నో ఊహాగానాలు.. మలుపులు.. కానీ దేనిపై స్పష్టత లేని వైనం. ఆత్మహత్య అని నిర్దారించాక కూడా.. హత్య అన్న ఆరోపణలకు బలం చేకూరేలా పలు అనుమానాలు తెరపైకి వస్తుండటం ఈ కేసును మరింత వివాదాస్పదం చేస్తోంది.

తొలి నుంచి ఆరోపిస్తున్నట్లుగానే శిరీషది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఇప్పుడు కూడా ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా వాదిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శిరీష పిన్నీ మరోసారి అదే ఆరోపణలు చేశారు. 'బ్యుటీషియన్ శిరీషను రాజీవ్, శ్రవణ్ లు మాత్రమే చంపలేదని, ఇందులో మరికొందరి పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శిరీషను ఒకరో, ఇద్దరో ఏమి చేయలేరని, ఆమె చేతులు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని' అన్నారు.

sirisha's aunt allegations on her death

ఆరడగుల పొడవైన శిరీషను ఒకరిద్దరు లొంగదీసుకోవడం జరిగే పని కాదన్నారు. కాబట్టి ఈ శిరీష హత్యలో ముగ్గురు లేదా నలుగురు వరకు నిందితులు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. శిరీష ఆత్మహత్య ఘటన అనంతరం ఆమె హ్యాండ్ బ్యాగ్ ను పోలీసులు భర్తకు అప్పగించారని, అలా అయితే కారులో ఉన్న మరొకరి హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని ఆమె ప్రశ్నించారు. కేసులో మరికొందరి ప్రమేయం ఉందని నిర్దారించేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏముంటుందన్నారు.

ఆరడగుల మనిషి ఫ్యాన్ కు ఉరేసుకుంటే.. కనీసం ఫ్యాన్ రెక్కలయినా వంగవా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. శిరీష ప్యాంట్, షర్ట్ ధరించిందని.. అలాంటప్పుడు చున్నీ ఎక్కడి నుంచి వచ్చిందని ఆమె నిలదీశారు. ఇవన్నీ చూస్తే.. శిరీషను హత్య చేశారన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+