ఏపీ మీదుగా వెళ్లాల్సిన శబరిమల స్పెషల్ రైలు రద్దు..
Sabarimala temple: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. భక్తిశ్రద్ధలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. 40 రోజుల పాటు సాగే మండలం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు.
కిందటి నెల 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. దీనితో శబరిమల అయ్యప్ప సన్నిధానం తలుపులను మూసివేస్తారు అర్చకులు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

మండలం పూజలు ముగిసే సమయంలో పథనంథిట్టలోని ఆరన్ములలో గల ప్రఖ్యాత శ్రీ పార్థసారథి ఆలయం నుంచి బంగారు నగరాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి అయ్యప్ప స్వామికి ధరింపజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం ఆదివారమే ఆరంభమైంది. రేపు సన్నిధానం చేరుకోవడంతో ముగుస్తుంది.
కాగా- శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు అదనపు, ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్, హైదరాబాద్, కాకినాడ పోర్ట్, శ్రీకాకుళం సహా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి శబరిమలకు రాకపోకలు సాగిస్తోన్నాయి ఆయా ప్రత్యేక రైళ్లన్నీ కూడా.
ఈ క్రమంలోనే సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లం మధ్య ఓ ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. దీనికి భక్తుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించట్లేదు. సరైన ఆక్యుపెన్సీ ఉండట్లేదు. దీనితో ఈ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా రద్దయింది. సరైన ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరువనంతపురం డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.
Cancellation of #Special #trains
— DRM Thiruvananthapuram (@TVC138) December 23, 2024
Passengers please note, #SouthCentralRailway has notified for cancellation of following Sabarimala specials due to poor occupancy. #SouthernRailway pic.twitter.com/J0x5uRewcl
ఇదివరకే ప్రకటించన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఉదయం 10:40 నిమిషాలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి 07161 ఎక్స్‌ప్రెస్ రెండో రోజు అర్ధరాత్రి 12 గంటలకు కొల్లం జంక్షన్ చేరుకోవాల్సి ఉంది. మళ్లీ ఈ నెల 26వ తేదీన 2:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు రద్దయినట్లు తిరువనంతపురం డీఆర్ఎం కార్యాలయం తెలియజేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications