మా గ్రామం పేరు మార్చండి మహా ప్రభో.. అసెంబ్లీలో ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన
మన ఊరి పేరు లేదా మన ప్రాంతం పేరు చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మన గ్రామానికున్న చరిత్రను అందరికి తెలియజేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ఇలా చారిత్రాత్మక నేపథ్యమున్న గ్రామాలు, ప్రాంతాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల పేర్లు బాగున్నా.. వాటికున్న చరిత్ర వర్ణనాతీతంగా ఉంటుంది. అయితే ఓ గ్రామం పేరు ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కుంటుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ గ్రామం పేరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. అసలు ఆ గ్రామం ఎక్కడుంది? దాని పేరేంటి?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన ప్రతిపాదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామం పేరు పలకడానికి అసభ్యకరంగా, వినేవారికి అసహ్యంగా ఉందని అది ఆ ప్రాంత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని వాపోయారు. ఊరి పేరు చెప్పుకోవడానికి గర్వ పడకపోయినా పర్లేదు కానీ.. అక్కడి ప్రజలు సిగ్గుపడాల్సి రావడం, సామాజికంగా అవమానాలు ఎదుర్కోవడం దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న సమస్య.

ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ.. 'ఆ ఊరి పేరు పలకడానికే ఇబ్బందిగా ఉంది. ఒక చోట ఆ పేరు చెప్పాల్సి వస్తే అక్కడి వారు నవ్వుతున్నారు. ఆ గ్రామంలో నివసించే వారు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తమ ఊరి పేరు చెప్పుకోవడానికి తీవ్రంగా అవమానపడుతున్నారు. గ్రామస్తులు ఇప్పటికే సామాజికంగా తమ గ్రామం పేరును 'నందిగూడ'గా మార్చుకున్నారు. అన్ని శుభకార్యాల పత్రికల్లో, స్థానిక బోర్డులపై నందిగూడ అనే రాసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ అధికారిక రికార్డులు, రెవెన్యూ పత్రాలు, ఆధార్ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాల్లో మాత్రం పాత పేరే కొనసాగుతోంది. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ పేరును ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రికార్డుల్లో కూడా పేరును మార్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను - అని ఆవేదన వ్యక్తం చేశారు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గ్రామానికి మద్దతు పెరుగుతుంది. ఎమ్మెల్యే కోరిన విధంగా ఆ గ్రామం పేరును నందిగూడగా మార్చాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ ఆ గ్రామం పేరు..
కాగజ్ నగర్ సమీపంలో ఉన్న ల*జగూడ అనే ఊరు పేరు మార్చాలి
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026
గ్రామస్తులు నందిగూడ అని మార్చుకున్నారు, రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్చాలని కోరుతున్నాను – బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు pic.twitter.com/3WOxbXUILJ
కాగజ్‌నగర్ పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఒక గ్రామం పేరు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ 'ల**గూడ' అని ఉంటుంది. సభలో ఈ గ్రామం పేరును కూడా సంభోదించడానికి ఎమ్మెల్యే తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరికి ఇంగ్లీష్ అక్షరాలను ఉపయోగిస్తూ.. స్పెల్లింగ్ ద్వారా ఆ గ్రామం పేరు (L-A-N-J-A Guda) ను సభ ముందు ఉంచారు. ఈ పేరు వినగానే అసెంబ్లీలో ఉన్న నేతలంతా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే హరీష్ బాబు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వెంటనే గ్రామ పేరు మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడా చర్చించుకుంటున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications