ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 20(మంగళవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానెల్ ఎండీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. మరి హరీష్ రావు విచారణకు హాజరవుతారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 20 న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ముఖ్యంగా సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయినప్పటి నుంచి దర్యాప్తు వేగం పెరిగింది. ఇందులో భాగంగానే గతంలో ట్యాపింగ్ బాధితులుగా ఉన్న 618 స్టేట్ మెంట్స్ ను పరిశీలిస్తుంది. అలాగే కొందరిని మరో సారి పిలిచి మరీ స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తోంది. ఇక రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావును సైతం పలు మార్లు విచారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications