Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెల్విన్‌కు ఉన్న ఆ అలవాటే కొంపముంచింది: సిట్ ఆధారాలకు నివ్వెరపోతున్న సినీ ప్రముఖులు

తాను డ్రగ్స్ సప్లయ్ చేసిన చాలా సందర్భాల్లో కెల్విన్.. ఆయా నటీనటులతో సెల్ఫీలు దిగాడు. ఈ సెల్ఫీలపై తేదీ, సమయం రికార్డయి ఉన్నాయి.

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముందు హాజరవుతున్న సినీ ప్రముఖులంతా భలేగా నటిస్తున్నారని తెలుస్తోంది. అసలు కెల్విన్ ఎవరో తమకు తెలియదని, జీవితంలో ఇంతవరకూ అతని పేరే వినలేదని వారు చెబుతున్నారు. ఇక తమ పరువు మొత్తం బజారుకీడ్చేస్తున్నారని ఇటు మీడియాపై సైతం వారు గగ్గోలు పెడుతున్నారు.

కానీ డ్రగ్స్ కేసులో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలు సంపాదించిన తర్వాతే.. సంబంధిత నటీనటులు, టెక్నీషియన్స్‌, తదితరులకు నోటీసులు పంపించారు. విచారణలో ఆ ఆధారాలతోనే వాళ్ల నోళ్లు మూయిస్తున్నారు.

కెల్విన్‌కు ఓ అలవాటు కూడా డ్రగ్స్ కేసులో కీలకంగా మారింది. తాను డ్రగ్స్ సప్లయ్ చేసిన చాలా సందర్భాల్లో కెల్విన్.. ఆయా నటీనటులతో సెల్ఫీలు దిగాడు. ఈ సెల్ఫీలపై తేదీ, సమయం రికార్డయి ఉన్నాయి. ఈ తేదీలకు కాస్త అటు, ఇటుగా కెల్విన్ తో నటీనటుల ఫోన్ సంభాషణలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కెల్విన్ నుంచి వీరికి డ్రగ్స్ అందాయని పోలీసులు నిర్దారించుకున్నారు. ఆ తర్వాతే నోటీసులు జారీ చేశారు.

sit officials counter to movie celebrities in enquiry

కాగా, సిట్ అధికారులు ఈ విషయాలను బయటపెడుతుండటంతో విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులు బెంబేలెత్తుతున్నారు. కెల్విన్ కు ఉన్న సెల్ఫీ అలవాటు వారిని షాక్ కు గురిచేస్తోందని చెబుతున్నారు. అదే తమ కొంప ముంచిందని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+