మరో కుదుపు: కమింగ అరెస్ట్‌తో భయం భయంగా టాలీవుడ్
హైదరాబాద్: నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ వర్గాల్లో కలకలం రేగుతోంది. ఎంతమంది పేర్లను కమింగ బయటపెట్టారోననే ఆందోళన నెలకొంది. కమింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేసే అవకాశాలు లేకపోలేదని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.విచారణలో కొన్ని పేర్లు చెప్పినట్టు ఎక్సైజ్ వర్గాలంటున్నాయి.
ఎక్సైజ్ కార్యాలయంలో ఓ వైపు ఛార్మి విచారణ సాగుతోండగానే కమింగను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ ప్రకటించారు.
కమింగ డ్రగ్స్ సరఫరాలోనూ, విక్రయాల్లోనూ కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు గుర్తించారు. కమింగ నుండి కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
కమింగకు సినీ పరిశ్రమతో 12 ఏళ్ళ అనుబంధం ఉంది. అయితే కమింగ 84 ఐడియాస్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధంగా పనిచేస్తోంది.

భయాందోళనలో టాలీవుడ్ పరిశ్రమ
కమింగ అరెస్ట్ కావడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. కమింగ ఎవరెవరి పేర్లను బయటపెట్టారోననే ఆందోళన నెలకొంది. ఆయనకు 12 ఏళ్ళుగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. కమింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నారు సిట్ అధికారులు. అయితే ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతోందనే ఆందోళన టాలీవుడ్‌ను కుదిపేస్తోంది.
Recommended Video


డిజిటల్ రంగంలో కమింగ సేవలు
2010లో ఇండియాకు వచ్చిన కమింగ ఇక్కడే ఉంటున్నాడు. క్రియేటివ్ మీడియాలో డిప్లామో, మల్టీమీడియా, కమర్షియల్ ఎకానమీలో ఉత్తీర్ణుడైన కమింగ అమెరికా, యూఏఈ, ఐరోపాలోని కొన్ని దేశాలతోపాటు హైద్రాబాద్‌లోనూ మరో వ్యక్తి భాగస్వామ్యంతో ఇదే పేరుతో సంస్థను ప్రారంభించాడు. వెస్ట్‌మారెడ్‌పల్లిలో ఉన్న కార్యాలయం ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంత సమాచారాన్ని ఎక్సైజ్ పోలీసులు సేకరించారు.

నెదర్లాండ్స్ నుండే డ్రగ్స్
ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారిని ప్రశ్నించిన సమయంలో తమకు ఎక్కువగా నెదర్లాండ్స్ నుండే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పినట్టు ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొరియర్ సంస్థలపై కూడ విచారణ చేస్తున్నారు అధికారులు. నెదర్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన ప్రతిసారీ కమింగ హైద్రాబాద్‌లోని తన కార్యాలయానికి వచ్చిపోతున్నారు.

సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించిన కమింగ
అరెస్టైన కమింగ విచారణలో కొందరు సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించారనే సిట్ వర్గాలంటున్నాయి. ప్రాథమిక విచారణలోనే ఈ విషయాలు వెలుగుచూశాయి. అయితే కోర్టు అనుమతితో ఆయనను మరోసారి అదుపులోకి తీసుకొని సిట్ వర్గాలు ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికి అందిన సమాచారం మేరకు టాలీవుడ్ సినీ రంగానికి చెందినవారి పేర్లను వెల్లడించినట్టు సమాచారం.అయితే వారెవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications