బిగుస్తున్న ఉచ్చు: కీలక సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు, వారికి దెబ్బేనా?

సినీ నటుడు సుబ్బరాజు వద్ద నుండి ఇంకా కీలక సమాచారం రాబట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఆయన విచారణను ఇంకా కొనసాగించనున్నట్టు ప్రకటించారు. శనివారంనాడు సినీనటుడు తరుణ్‌తో పాటు పబ్, క్

హైదరాబాద్: సినీ నటుడు సుబ్బరాజు వద్ద నుండి ఇంకా కీలక సమాచారం రాబట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఆయన విచారణను ఇంకా కొనసాగించనున్నట్టు ప్రకటించారు. శనివారంనాడు సినీనటుడు తరుణ్‌తో పాటు పబ్, క్లబ్, బార్ యజమానులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు.

సినీ పరిశ్రమలోని ప్రముఖులకు డ్రగ్ కేసుతో సంబంధాలున్నాయనే విషయమై ఎక్సైజ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ప్రముఖదర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణతో ఎక్సైజ్ పోలీసులు ప్రారంభించారు.

SIT officials interrogates cine actor Subbaraju

అయితే తొలుత డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విచారణకు హజరైన సినీ ప్రముఖులు సిట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో దిమ్మతిరిగిపోయారు.

అయితే విచారణకు హజరైన సినీ ప్రముఖుల నుండి ఎక్సైజ్ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సుబ్బరాజు నుండి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సుబ్బరాజు నుండి కీలకమైన సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సిట్ అధికారులు ప్రకటించారు. సాయంత్రం ఆరున్నరగంటల సమయంలో సుబ్బరాజు విచారణకు బ్రేక్ ఇచ్చారు.

ఈ నెల 22న, సినీ హీరో తరుణ్‌ను విచారణకు రానున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. అంతేకాదు హైద్రాబాద్‌లోని పబ్, క్లబ్, బార్ యజమానులను విచారించనున్నట్టు చెప్పారు.

ఇప్పటికే సుమారు 16 పబ్, క్లబ్‌లలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు. వీటిపై నిఘాను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 27వ, తేదిన సినీ నటి ముమైత్‌ఖాన్ విచారణకు హజరుకానున్నారని చెప్పారు.

విచారణకు సుబ్బరాజు సహకరిస్తున్నాడని అకున్ సబర్వాల్ ప్రకటించారు.అయితే హైద్రాబాద్‌లో ఉన్న పబ్, క్లబ్‌లలో డ్రగ్స్ విక్రయం లేదా డ్రగ్స్ అందుతున్న విషయాలపై సుబ్బరాజు నుండి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు. దీంతో ఈ కేసులో మరింత సమాచారం కోసం సుబ్బరాజును విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+