కేసీఆర్‌కు భారీ షాక్?: శ్రీధర్ బాబును కలిసిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా ఏకంగా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి, రంగారెడ్డి ఇంఛార్జీ శ్రీధర్ బాబును కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి శనివారం మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యేలు అందించారు.

Six BRS MLAs met Minister Sridhar Babu

జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుంచి జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వలేదన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క తొలగించాలని, దోమలను నివారించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో ఎలక్ట్రికల్ పోల్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో నెలకొన్న శానిటేషన్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యేల విజ్ఠప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందన్నారు. తప్పకుండా మీ సమస్యలను తీరుస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

అయితే, ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరంతా కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. సుమారు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ మంత్రులు ఇప్పటికే ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+