ఘోరం: ఆస్తి కోసం స్నేహితుడితోపాటు అతడి కుటుంబం దారుణ హత్య, ఆరుగురిని వేర్వేరుగా

నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం వారం రోజుల వ్యవధిలో ఒకరికి తెలియకుండా మరొకరిని దారుణంగా హతమార్చాడు నిందితుడు. చివరకు అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిజామబాద్ (Nizamabad) జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లూరుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఆస్తిపై కన్నేశాడు అతడి స్నేహితుడు, నిందితుడు ప్రశాంత్. ఈ క్రమంలో ఆస్తి కోసం మొదట ప్రసాద్‌ని హత్య చేశాడు ప్రశాంత్. ఆ తర్వాత డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తర్వాత ప్రసాద్ ఇంటికి వెళ్లిన నిందితుడు ప్రశాంత్.. ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పి అతడి భార్యను తీసుకెళ్లి చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని బాసర వద్ద గోదావరి నదిలో పడేశాడు.

Six family members murdered in Nizamabad district: Accused arrested

అంతడితో ఆగకుండా.. ప్రసాద్, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి ప్రసాద్ సోదరిని తన వెంట తీసుకెళ్లి హత్య చేశాడు ప్రశాంత్. అనంతరం ప్రసాద్ ఇద్దరు పిల్లలనూ హత్య చేసి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో పడేశాడు. ప్రసాద్ మరో సోదరిని కామారెడ్డి సదాశివనగర్‌లో చంపి కాల్చేశాడు ప్రశాంత్. కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆరుగురి హత్యోదంతం బయటపడింది. మొదటి మూడు హత్యలను ఒక్కడే చేసిన ప్రశాంత్.. తర్వాతి మూడు హత్యలను స్నేహితులతో కలిసి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు ప్రసాద తోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ప్రసాద్‌ ఇంటిపై కన్నేసిన ప్రశాంత్.. లోన్ అవసరం ఉందని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోవడంతో తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఇది తట్టుకోలేక ప్రశాంత్‌ ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు ప్రశాంత్ క్రైమ్ బ్యాగ్రౌండ్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+