ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్: అలరించిన తెలంగాణ డే ప్రదర్శనలు(పిక్చర్స్)
హైదరబాద్: క్యాన్సర్ బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్న స్పర్శ్ హోస్పైస్ సంస్థకు విరాళాల సేకరణ కోసం నగరంలో నిర్వహించిన స్కై ఫెస్ట్ ఉత్సాహంగా ముగిసింది. ఐఏఎఫ్ ఆకాశ్ గంగ బృందం ఆదివారం కూడా పారా జంప్ చేసింది. జుంబా నృత్యాలు, సంగీత ప్రదర్శన అలరించాయి. గచ్చిబౌలి స్టేడియంలో వేడుకగా ప్రారంభమైన స్కైఫెస్ట్ ఆదివారం రాత్రి మిడ్‌నైట్ మూవీతో ముగిసింది.
ఇద్దరు తొక్కే సైకిల్స్‌పై రైడ్ చేసి సందర్శకులు ముచ్చట తీర్చుకున్నారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. పాప్ గాయని స్మిత గానాలాపనతో ఉత్సాహపరిచారు.
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, మెక్సికో కళాకారుల హులా హాప్ నృత్యాలు, స్పెయిన్ కళాకారుల అద్భుత విన్యాసాలు, ఇంద్రజాల ప్రదర్శనలు, సంగీతం, విందులు, వినోదాలు, ఇంద్రజాల విద్యలు, పిల్లలకు ఫన్ జోన్, గేమింగ్, షాపింగ్,అడ్వెచంర్ అనుభూతులు, మ్యూజిక్ కాన్సర్ట్, మిడ్‌నైట్ మూవీ నగర వాసులను 5 రోజుల పాటు ఆనందడోలికల్లో ఊగించాయి.
చివరి రోజు తెలంగాణ డే
తెలంగాణ డే పేరుతో నిర్వహించిన చివరి రోజు స్కై ఫెస్ట్‌లో మన సంస్కృతిక కళారూపాలను వేదికలపై ప్రదర్శించారు. తెలంగాణ జానపద గీతాలు, నృత్యాల ప్రదర్శనతోపాటుగా రెగ్యులర్‌గా రాత్రి ఏడు గంటలకు నిర్వహించే మ్యూజిక్ కాన్సర్ట్‌ను తీన్మార్ పేరిట నిర్వహించారు. ఈ తీన్మార్‌లో సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ బృందం సంగీత ప్రియులను ఓలలాడించింది.
పాప్ సింగర్ స్మిత తన కొత్త ఆల్బమ్ బాహు కిలికిని ఈ వేదికపై ఆవిష్కరించారు. అనంతరం 20 నిమిషాల పాటు ఆమె తన బృందంతో కలిసి ఆడుతూ పాడారు. సంగీత దర్శకుడు రఘు కుంచె సినీ పాటలు ఆలపించారు. చివరి రోజు హెలికాప్టర్‌ను 1000 అడుగుల ఎత్తులో తిప్పుతూ పారా జంపింగ్ నిర్వహించడాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
క్యాన్సర్ బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్న స్పర్శ్ హోస్పైస్ సంస్థకు విరాళాల సేకరణ కోసం నగరంలో నిర్వహించిన స్కై ఫెస్ట్ ఉత్సాహంగా ముగిసింది.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
ఐఏఎఫ్ ఆకాశ్ గంగ బృందం ఆదివారం కూడా పారా జంప్ చేసింది. జుంబా నృత్యాలు, సంగీత ప్రదర్శన అలరించాయి.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
గచ్చిబౌలి స్టేడియంలో వేడుకగా ప్రారంభమైన స్కైఫెస్ట్ ఆదివారం రాత్రి మిడ్‌నైట్ మూవీతో ముగిసింది.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
ఇద్దరు తొక్కే సైకిల్స్‌పై రైడ్ చేసి సందర్శకులు ముచ్చట తీర్చుకున్నారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
సంగీత దర్శకుడుఆర్‌పీ పట్నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. పాప్ గాయని స్మిత గానాలాపనతో ఉత్సాహపరిచారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, మెక్సికో కళాకారుల హులా హాప్ నృత్యాలు, స్పెయిన్ కళాకారుల అద్భుత విన్యాసాలు, ఇంద్రజాల ప్రదర్శనలు, సంగీతం, విందులు, వినోదాలు, ఇంద్రజాల విద్యలు, పిల్లలకు ఫన్ జోన్, గేమింగ్, షాపింగ్,అడ్వెచంర్ అనుభూతులు, మ్యూజిక్ కాన్సర్ట్, మిడ్‌నైట్ మూవీ నగర వాసులను 5 రోజుల పాటు ఆనందడోలికల్లో ఊగించాయి.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
తెలంగాణ డే పేరుతో నిర్వహించిన చివరి రోజు స్కై ఫెస్ట్‌లో మన సంస్కృతిక కళారూపాలను వేదికలపై ప్రదర్శించారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
తెలంగాణ జానపద గీతాలు, నృత్యాల ప్రదర్శనతోపాటుగా రెగ్యులర్‌గా రాత్రి ఏడు గంటలకు నిర్వహించే మ్యూజిక్ కాన్సర్ట్‌ను తీన్మార్ పేరిట నిర్వహించారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
ఈ తీన్మార్‌లో సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ బృందం సంగీత ప్రియులను ఓలలాడించింది.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
పాప్ సింగర్ స్మిత తన కొత్త ఆల్బమ్ బాహు కిలికిని ఈ వేదికపై ఆవిష్కరించారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
అనంతరం 20 నిమిషాల పాటు ఆమె తన బృందంతో కలిసి ఆడుతూ పాడారు. సంగీత దర్శకుడు రఘు కుంచె సినీ పాటలు ఆలపించారు.

ఉత్సాహంగా ముగిసిన స్కైఫెస్ట్
5 రోజుల్లో 60 వేల మందికి పైగా స్కై ఫెస్ట్‌ను సందర్శించారని ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీష్ రామడుగు అన్నారు. వచ్చే ఏడాది మరింత ఆకర్షణీయంగా స్కై ఫెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications