జూబ్లీహిల్స్‌లో పేలుడు, ఒకరికి గాయాలు: డిటోనేటర్ పేలినట్లుగా అనుమానాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడి అజయ్ బార్ వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు, క్లూస్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
చెత్తకుప్పలో దొరికిన వస్తువును విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పేలుడు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం నిపుణులు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించారు. ఆధారాలను బట్టి డిటోనేటర్ పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.













Click it and Unblock the Notifications