Smita Sabharwal: సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.. ఛీఫ్ జస్టిస్‍ను అభ్యర్థించిన స్మితా సబర్వాల్..
బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్ అసోసియేషన్ ప్రకటనను ఆమె రీట్వీట్ చేశారు.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసినట్లు అభియోగాలు మోపబడిన దోషి విడుదల చేయాలని నిర్ణయించడంపై విస్మయం వ్యకం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషి విడుదల చేస్తే న్యాయాన్ని తిరస్కరించినట్లేనని ఐఎఎస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ నిర్ణయం ప్రభుత్వోద్యోగుల మనోధైర్యాన్ని క్షీణింపజేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా పునఃపరిశీలించాలని అసోసియేషన్ అభ్యర్థించింది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న కృష్ణయ్య కుటుంబం, బ్యూరోక్రాట్‌పై దాడికి ప్రేరేపించిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడంలో జోక్యం చేసుకొని ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. బీహార్ జైలు మాన్యువల్‌ను సవరించడం ద్వారా మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని హత్యకు గురైన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకుని నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే చేయాలని విజ్ఞప్తి చేశారు.
తన భర్త ఐఏఎస్ అధికారి అని, న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె అన్నారు. రాజ్‌పుత్‌ల ఓట్ల కోసం, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన భర్తను చంపిన వ్యక్తిని విడుదల చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అప్పటలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విడుదల చేయడంపై కూడా స్మిత సభర్వాల్ స్పందించారు. రేపిస్టులను జైలు నుంచి విడిచి పెట్టడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా తాను ఈ వార్తను చూసిన తరువాత నమ్మలేకపోయానని చెప్పారు. స్వేచ్ఛాయుత దేశంలో ఉన్నాననే నమ్మకం తనకు కలగట్లేదని వ్యాఖ్యానించారు. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా, స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications