Smita Sabharwal: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ ఏమన్నారంటే..!
ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఏ విషయమైనా స్పందిస్తారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాజాగా సమంత, నాగ చైతన్యపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు మహిళలను టార్గెట్ చేయడం దారుణమన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. ప్రతిది రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. అందరిని గౌరవించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అయితే స్మితా సబర్వాల్ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తునే.. సోషల్ మీడియాలో సురేఖపై చేసిన ట్రోల్స్ పై స్మితా సబర్వాల్ స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. ఒక తమ్ముడిగా రఘునందన్ రావు చేనేత కార్మికులు తయారు చేసిన దండ వేస్తే .. బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు చేయడం మీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్మితా సబర్వాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మంత్రి కొండ సురేఖ సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని చెప్పారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందించారు. నాగ చైతన్య స్పందించారు. అలాగే సమంత కూడా స్పందించారు. ఆ తర్వాత కొండా సురేఖ తను సమంతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లుగా చెప్పారు. తను కావాలని సమంత గురించి మాట్లాడలేదని.. కేటీఆర్ గురించి వివరించే ప్రయత్నంలో ఇలా జరిగిందని అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలన టాలీవుడ్ తీవ్రంగా ఖండించింది.
కాగా కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అక్కినేని నాగార్జున కూడా మంత్రి కొండా సురేఖకు నోటీసులు పంపించే అవకాశం ఉంది. చాలా మంది ప్రజా సమస్యలను పక్కకు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించుకోవడం తప్పని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రైతు రుణ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. ప్రతి పక్షాలు వాటి పోరాటం చేయాలని సూచిస్తున్నారు. అధికారం పక్షం ఇచ్చి హామీలు అమలు చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications