పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్.. రూ.9 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాలో స్మగ్లింగ్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఆ సినిమాను మించిన విధంగా ఓ గ్యాంగ్ అక్రమ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. కోల్‌ కతా నుంచి హైదరాబాద్‌ కు కారులో బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా DRI అధికారులు ఆ గ్యాంగ్ ను విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న 5,832.90 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ.8.98 కోట్లు ఉంటుంది. ఈ బంగారాన్ని కస్టమ్స్ చట్టం కింద సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు. అలాగే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. కోల్‌ కతా నుంచి హైదరాబాద్‌ కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని డీఆర్ ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారుపై అనుమానం వచ్చి ఆ కారుని వెంబడించిన డీఆర్ఐ అధికారులు దాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. కారులో రూ. 8.98 కోట్ల విలువైన 5.83 కిలోల విదేశీ బంగారం లభ్యం అయింది. కారులోని ఫ్రంట్ సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రహస్య అరలో ఈ బంగారాన్ని స్మగ్లర్లు దాచినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, జ్యుడిషియల్ కస్టడీకి అధికారులు తరలించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Smuggling Gold worth 9 crore seized while being smuggled by car from Kolkata to Hyderabad latest

మరో ఘటనలో తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఓ 43 ఏళ్ల వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ ను చేసేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ వేశాడు. అలా ఒడిషా బోర్డర్ లో ఓ వ్యక్తి వద్ద మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దాన్ని ఎవరికీ అనుమానం రాకుండా పొట్టకు చుట్టుకుని టేపులను అతికించాడు. చూసేవాళ్లకు అది పెద్ద పొట్టలాగే అనిపించేలా జాగ్రత్తపడ్డాడు. అలా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న క్రమంలో అతడి షర్ట్ కింద ఓ టేప్ వేలాడటం చూసి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడ్ని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+