కరీంనగర్ జిల్లాలో వింత పాము: నోరు తెరిచి అరుస్తోంది(వీడియో)

కరీంనగర్: జిల్లాలో అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మకాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు.

ఆ పాము నోరు తెరిచి వింత అరుపులు చేయడం గమనార్హం. దీంతో పామును చూసిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు ఈ పాము నోటితో చేస్తున్న శబ్ధాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో భారీగా వైరల్ అవుతోంది.

 snake spotted in karimnagar district makes strange noises

పాము వింత వింతగా అరుస్తుండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ పామును పట్టుకోవాలని, ఇలాంటి పాములు ఇక్కడ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

అయితే, ఈ వీడియో నెల రోజుల క్రితం మైక్ మార్టిన్ అనే యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ అయ్యిందని, దాన్ని డౌన్‌లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియో‌ని వైరల్ చేశాడని కొందరు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+