Snakes: చందుర్తిలో పాముల సయ్యాట.. వైరల్ అయిన వీడియో..
పాములను అంటే దాదాపు అందిరికి భయమే. పామును చూస్తే కొంత మందికి భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాము కనిపిస్తే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. పాములు అంటే భయం ఉన్నా వాటి గురించి తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. పాములకు సంబంధించి వీడియోలు, వార్తలు చూసే వారు ఎక్కువే ఉంటారు. అయితే ఇంటర్ నెట్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాముల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎవరికి పాము కనిపించిన తమ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు.
వైరల్ అయిన వీడియో..
జనావాసాల్లోకి వచ్చి అవి చేసే సయ్యాట వీడియోలు తీస్తుంటారు. పాముల సయ్యాట వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో పాముల సయ్యాట వీడియో వైరల్ గా మారింది. నిర్మానుష్య ప్రదేశంలో రెండు పాములు జతగా కూడి సయ్యాటలాడాయి. దాదాపు 10 నిమిషాల పాటు రెండు పాములు ఒకదానిని మరొకటి చుట్టుకుని సయ్యాట ఆడడాన్ని అక్కడున్న యువకులు ఫోన్ వీడియో తీశారు. వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అయితే అవి ఏం పాములు తెలియరాలేదు.

పాములను ఏం అనొద్దు..
పాములు కావాలని మనుషులకు హాని చేయవని.. వాటి దగ్గరికి అనవసరంగా వెళ్లినప్పుడే కాటు వేస్తుందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. పాముల సయ్యాట సమయంలో వాటి వద్దకు అసలు వెళ్లొద్దని సూచిస్తున్నారు. అయితే చాలా వరకు పాములకు విషం ఉండదని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications