అర్ధరాత్రి భార్యను నిర్బంధించి.. భర్తను ఎత్తుకెళ్లి చంపేశారు

మెదక్: జిల్లాలోని చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వివాహితను తాళ్లతో బంధించి, ఆమె భర్తను అపహరించుకుపోయారు.

అనంతరం అతడ్ని గ్రామ శివారులో హత్య చేసిన దుండగులు, పరారయ్యారు. మృతుడి భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆమెను విడిపించారు. భర్త కోసం గ్రామస్తుల సాయంతో వెదకసాగారు.

కాగా, గ్రామ శివారులో భర్త మృతదేహాన్ని కనుగొన్నారు. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైన భార్య, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Some thugs allegedly murdered a man in Medak district.

నూకపల్లిలో యువకుడి దారుణ హత్య

కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నూకపల్లి దగ్గర ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కొందరు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆడపిల్ల పుట్టిందని కోడలిని చంపేందుకు యత్నం

ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలును చంపేందుకు అత్తామామలు ప్రయత్నించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా చిట్యాల మండలం రాఘవాపూర్‌లో చోటుచేసుకుంది. అత్తామామల చర్యను గ్రామస్తులు నిలువరించి వారిని నిర్బంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+