ఏదో జ‌రుగుతోంది..! రేవంత్ కోసం ప‌క‌డ్బందీ ప‌ద్మవ్యూహం సిద్ద‌మ‌వుతోంది..!

Recommended Video

    ఏదో జ‌రుగుతోంది..! రేవంత్ కోసం ప‌క‌డ్బందీ ప‌ద్మవ్యూహం

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిణామాలు. ముంద‌స్తు ఎన్నిక‌ల వాతార‌ణం. పార్టీలు గెలుపుకోసం కొత్త కొత్త వ్యూహాలు. మ‌రి కొన్ని పార్టీల పొత్తులు. అదికార పార్టీకి చ‌ర‌మ‌గీతం పాడాల‌ని కొన్ని పార్టీలు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అవ‌కాశం ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని అదికార పార్టీ. ఎన్నిక‌ల ప్రాచారాన్ని మొద‌లుపెట్టిన అదికార పార్టీ. మ‌రో ప‌క్క స‌ర్వే నివేదిక‌లు. ఎవ‌రికి ఎంత ప్ర‌జా మ‌ద్ద‌త్తు ఉందో తేల్చి చెప్ప‌డంతో అయోమ‌యానికి గురౌతున్న పార్టీలు. ఏది నమ్మాలో ఏది న‌మ్మ‌కూడ‌దో తేల్చుకోలేని సందిగ్ద పరిస్థితులు..! ఇవన్ని ప్ర‌స్తుతం తెలంగాణ లో చోటు చేసుకున్న ప‌రాణామాలు.

    PHOTOS: Income Tax Raids On Revanth Reddy Of Congress

    ఇవ‌న్నీ ఒక ఎత్తైతే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు మ‌రో ఎత్తు. న‌కిలీ కంపెనిల‌తో వేల‌కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డుతున్నాడంటూ రేవంత్ రెడ్డి పై వ‌చ్చిన అభియోగాల‌కు, ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌నే అంశం ప‌ట్ల లోతైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల స‌హ‌కారం తో పాటు కొన్ని మీడియా సంస్థ‌ల అదినేత‌లు కూడా ఈ వ్య‌వ‌హారాన్ని చాక‌చ‌క్యంగా ముందుకు న‌డిపిస్తున్న‌ట్టు గ‌స‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదికార పార్టీ విధానాల‌పై గ‌ళ‌మెత్తిన ఓ నిఖార్సైన ప్ర‌జా నాయ‌కుడి గొంతు నొక్కేందుకు యంత్రాంగం మొత్తం ఏక‌మై క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి.

    రేవంత్ రెడ్డి పై ఐటి దాడులు..!రాజ‌కీయ భ‌విత‌వ్వానికి చెక్ పెట్టేందుకే..!

    రేవంత్ రెడ్డి పై ఐటి దాడులు..!రాజ‌కీయ భ‌విత‌వ్వానికి చెక్ పెట్టేందుకే..!

    కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఐటి దాడులు. గురువారం రోజున‌ సంచ‌ల‌నం రేపిన అంశం. దీనిపై కాంగ్రెస్ విమర్శలు. వెంటనే ప్రధాన పార్టీలైన బిజెపి, టీఆర్ఎస్ లు ఈ దాడులతో మాకేమి సంబంధం అంటూ ఖండనలు. అటు మోడీకి, ఇటు కెసీఆర్ కూ అసలు దీంతో సంబంధం ఎలా ఉంటుంది?. ఆ అవసరం ఏముంటుంది? అంటూ ప్రశ్నలు. కానీ గురువారం సాయంత్రానికి అన్ని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు 70 పేజీల స్పైరల్ బైండింగ్ బుక్ వచ్చిపడింది. రేవంత్ రెడ్డి రాజ‌కీయ భ‌విత‌వ్వానికి చెక్ పెట్టేందుకే ఇలాంటి ప‌క‌డ్బంది కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

     డాక్యుమెంట్లను మీడియా సంస్థలకు అండ‌జేయ‌డంలో ఆంత‌ర్యం ఏటి..?

    డాక్యుమెంట్లను మీడియా సంస్థలకు అండ‌జేయ‌డంలో ఆంత‌ర్యం ఏటి..?

    అందులో కాంగ్రెస్ నేత అక్రమాలకు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి. లావాదేవీలకు సంబంధించిన చెక్కుల వివరాలు, భూ లావాదేవీలకు సంబంధించిన పలు అంశాలు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందులో ఉన్నాయి. ఓ పక్కన రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్ళపై దాడులు కొనసాగుతుండగా, సాయంత్రం ఆరేడు గంటల సమయంలో అంత పకడ్భందీగా అన్ని ఆధారాలను డాక్యుమెంట్లను మీడియా సంస్థలకు అందజేశారంటే అందులో ఎవరూ లేరని నమ్మాలా? ఏ రాజ‌కీయ పార్టీ ప్ర‌మేయం లేకుండానే అంత ప‌కడ్బందీగా ఈ వ్య‌వ‌హారం న‌డించిందా అని కూడా విశ్లేశ‌కులు అనుకుంటున్నారు.

    ఛానళ్ళను కొనుగోలు చేసిన ఓ బడా వ్యక్తి.. రేవంత్ విష‌యంలో ఎందుకంత ఆస‌క్తి..!

    ఛానళ్ళను కొనుగోలు చేసిన ఓ బడా వ్యక్తి.. రేవంత్ విష‌యంలో ఎందుకంత ఆస‌క్తి..!

    రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడి ఉంటే ఆయనపై కేసు పెడతారు?. ఆయా ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయి. అది వేరే విషయం. కానీ తమకు ఈ కేసుకు సంబంధం ఏ మాత్రం లేదని పలు పార్టీలు పదే పదే ప్రకటిస్తుండటంతోనే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. అంతే కాదు, ఈ మధ్యే పలు ఛానళ్ళలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన ఓ బడా వ్యక్తి తొలి సారి ఛానల్ కార్యాలయానికి వచ్చి మరీ ఆ వివరాలు అందజేసినట్లు మీడియా సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. అంత ఉత్సాహం చూపిస్తుంది ఓ రాజ‌కీయ నాయ‌కుడిని వివిద కేసుల్లో ఇరికించేందుకే అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

    అంద‌రి స‌హ‌కారం తోనే పక్కా టార్గెట్..!

    అంద‌రి స‌హ‌కారం తోనే పక్కా టార్గెట్..!

    రేవంత్ రెడ్డి చేసింది అక్రమమా.. సక్రమమా.. నీతా.. అవినీతా అన్నది విచారణా సంస్థలు, కోర్టులు మాత్రమే తేల్చాలి. కానీ ఇది మాత్రం ముందస్తు ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ని పక్కా టార్గెట్ చేసేందుకే సాగిందనేది మాత్రం వాస్తవం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకు బలమైన కారణం ఆ పార్టీ మీడియా సంస్థకు పంపిన పుస్తకాన్నే ఉదాహరణగా చూపుతున్నాయి. ఒక సాధార‌ణ న్యాయ‌వాది ఇమ్మ‌నేని రామారావు అనే వ్య‌క్తి ఇస్తున్న ఆధారాలను ఆస‌రా చేసుకుని స‌ద‌రు వ్య‌క్తులు ఇంత‌టి కక్ష్య సాధింపుకు దిగుతున‌ట్టు ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+