బ్లూఫిల్మ్స్ చూపించి మేనత్తపై లైంగిక దాడి: యాచకురాలిపై రేప్... హత్య

హైదరాబాద్: తల్లి తర్వాత తల్లిలా చూసుకోవాల్సిన మేనత్తపై ఇద్దరు మేనల్లుళ్లు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. స్మార్ట్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూపుతూ తమ లైంగిక కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే... భర్త షకీల్‌, నలుగురు పిల్లలతో ఓ గృహిణి జైన్‌ బిన్‌ అక్బర్‌(25) గోల్కొండ ప్రాంతంలో అత్త, మరిది, ఆడపడుచులతో కలసి ఉమ్మడిగా ఉంటోంది. అయితే, షకీల్‌ మద్యానికి బానిసై.. భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా భార్యను పట్టించుకోవడం మానేశాడు.

దీనిని గమనించి, ఆమె మేనల్లుళ్లు వరసయ్యే హైదర్‌బిన్‌ అక్బర్‌(23), జైన్‌బిన్‌ అక్బర్‌(22)లు కొద్దికాలంగా ఆమెను వేధించడం మొదలు పెట్టారు. అర్థరాత్రి పూట ఇద్దరు యువకులు కూడా ఆమె వద్దకు వెళ్లి లైంగిక కోరికలను తీర్చాలని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు.

అంతేకాదు స్మార్ట్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూపించేవారు. ఈ క్రమంలో జైన్‌ బిన్‌ అక్బర్‌ ఒకరోజు అర్ధరాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో గదిలోకి ప్రవేశించి లోబరచుకునేందుకు యత్నించాడు. ఈ వేధింపులను భరించలేక ఆమె అత్త, భర్తలకు విషయం చెప్పినా పట్టించుకోలేదు.

అంతేకాదు సదరు యువకులకు బుద్ధి చెప్పాల్సింది పోయి ఆమెపైనే ఎదురుదాడికి దిగారు. పైగా ఆమెదే తప్పుగా చిత్రీకరించి చేయిచేసుకున్నారు. దీంతో బాధితురాలు బండ్లగూడలోని పుట్టింటికి చేరి, తల్లిదండ్రుల సాయంతో సోమవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో భర్త సహా ఇద్దరు మేనల్లుళ్లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Son in law harassed in by aunt in hyderabad

రంగారెడ్డిలో దారుణం: యాచకురాలిపై లైంగికదాడి, ఆపై హత్య

ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేసిన ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తుర్కపల్లి గ్రామంలో గత నెల రోజులుగా ఓ యువతి(23) భిక్షాటన చేస్తూ తిరుగుతోంది.

మిషన్ భగీరథ కోసం సంపు నిర్మాణం చేసేందుకు తీసిన సంపు గుంతలో సోమవారం విగతజీవిగా కనిపించింది. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ జహంగీర్‌కు సమాచారం అందజేశారు. దీంతో వారు పోలీసులకు విషయం తెలుపడంతో సీఐ సత్తయ్య నేతృత్వంలో ఎస్సై రవి, చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

యువతి మృత దేహాన్ని పరిశీలించగా రాళ్లతో మోది హత్య చేసిన విషయాన్ని గమనించిన పోలీసులు డాగ్‌స్కాడ్‌ను పిలిపించారు. యువతిని హత్య చేసిన వారిని గుర్తించేందుకు తీసుకువచ్చిన జాగిలం గ్రామ పరిధిలోని కళ్లుదుకాణం, ఆటో స్టాండ్, ప్రధాన రోడ్డుపై వెళ్లి తిరిగి సంఘటన స్థలానికి చేరుకుంది.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ సందర్శించారు. హత్య విషయంపై స్థానికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యువతి హత్యపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు 23-25 మధ్య వయస్సు ఉన్న యువతిని దుండగులు లైంగికదాడి చేసి తర్వాత రాళ్ళతో తలపై మోది హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+