సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు: రణ్‌దీప్, జైపాల్ రెడ్డి
Recommended Video

సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్‌బై
హైదరాబాద్/న్యూఢిల్లీ: సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, కేవలం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని ఆ పార్టీ ప్రకటించింది.
ఈ మేరకు పార్టీ నేత రణ్‌దీప్ సుర్జేవాలా, జైపాల్ రెడ్డి తదితరులు స్పందించారు. సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, ఆమె సేవలు పార్టీకి ఇంకా అవసరమని రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.

తెలంగాణ నాయకులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా తప్పుకోవడం లేదన్నారు. కేవలం రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్పారు. రాహుల్ సామర్థ్యం గుజరాత్ ఎన్నికల సమయంలో చూశామన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications