పెద్ద తప్పు చేశా.. క్షమించండి: ప్రణీత్ హనుమంతు
ఓ తండ్రీకూతురుకు సంబంధించిన వీడియోపై డార్క్ కామెడీ పేరుతో అసభ్య వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఆయన తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని.. అందుకు తనను క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని ప్రణీత్ హనుమంతు చెప్పుకొచ్చారు.
కాగా, ఒక తండ్రి తన కూతరుతో సరదాగా చేసిన వీడియోపై.. ప్రణీత్ సహా కొందరు యూట్యూబర్లు డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా అసభ్యకరంగా మాట్లాడారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత హేయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోక్సో చట్టం కింద ప్రణీత్ ను అరెస్ట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో తన ఘోర తప్పిదాన్ని తెలుసుకున్న ప్రణీత్.. అభ్యంతరకర వీడియో భాగాలను తీసివేశారు. వీడియో నుంచి అసభ్యకర వ్యాఖ్యలను తొలగించారు. అంతేగాక, దీనిపై క్షమాపణలు కూడా చెప్పారు.
కంటెంట్ క్రియేటర్‌గా తన ప్రయత్నం సంతోషంగా ఉంచడమేనని.. కానీ, ఈసారి గీతా దాటినట్లు ప్రణీత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ వీడియో కారణంగా తన తల్లిదండ్రులు కూడా బాధపడ్డారని తెలిపారు. తాను పెద్ద తప్పు చేశానని.. తనను అందరూ క్షమించాలని కోరారు. ఇలాంటి తప్పు మరోసారి జరగదని అన్నారు.












Click it and Unblock the Notifications