సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు - రూట్, టైమింగ్స్..!!

సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రెగ్యులర్ రైళ్లతో పాటుగా ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. దీంతో, గోదావరి జిల్లాలకు పెద్ద సంఖ్య లో ఉన్న వెయిటింగ్ లిస్టును గుర్తించిన అధికారులు మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైళ్ల వివరాలతో పాటుగా రూట్ .. టైమింగ్స్ వెల్లడించారు. ఈ రోజు నుంచి ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది.

ఏ రోజుల్లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 9, 11 తేదీల్లో కాచిగూడ - కాకినాడ టౌన్‌(07653), అదే విధంగా 10, 12 తేదీల్లో కాకినాడ టౌన్‌- కాచిగూడ(07654), 10న నాంపల్లి-కాకినాడ టౌన్‌(07023), 11న కాకినాడ-నాంపల్లి(07024) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఈ రైళ్లకు నేడు(గురువారం)ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌ ప్రారంభించారు. ఈ ట్రైన్లు హైదరాబాద్‌ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించనున్నాయి.

south Central railway announces six special trains for Pongal for Kakinada

రైళ్ల షెడ్యూల్
కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్‌ -కాచిగూడ రైలు (07654) జనవరి 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.

రద్దీకి అనుగుణంగా
హైదరాబాద్‌ - కాకినాడ టౌన్‌ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఇదే సమయంలో ప్రత్యక రైళ్లకు వచ్చే డిమాండ్ ను గుర్తించి.. అవసరమైతే మరిన్ని రైళ్ల పైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+