చర్లపల్లి వెళ్లాల్సిన అవసరం లేని రైళ్లు ఇవే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను విమానాశ్రయం తరహాలో ఆధునికీకరించేలా పనులు జరుగుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఈ క్రమంలోనే పనులకు ఆటంకం కలుగుతుందని కొన్ని ప్లాట్ ఫామ్స్ మూసేశారు. చాలావరకు రైళ్లను నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లికి మార్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి అతి తక్కువ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడం, సెలవులుండటంతో ఇది ప్రత్యేక రైళ్లను నడిపే సమయం. వాటినుంచి దక్షిణ మధ్య రైల్వేకు అత్యధిక ఆదాయం ప్రతి ఏడాది సమకూరుతోంది. తాజాగా 16 ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్ నుంచే అందుబాటులోకి తెచ్చారు. వీటికోసం ఇతర రైల్వేస్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏయే రైళ్లు సికింద్రాబాద్ నుంచి నడుస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.

సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం వరకు 07695 (మే 7వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ప్రతి బుధవారం)
రామేశ్వరం నుంచి సికింద్రాబాద్ వరకు 07696 (మే 9వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం)

South Central Railway has arranged special trains from Secunderabad to Rameswaram

కాచిగూడ నుంచి మధురైకి (07191) మే 12వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రతి సోమవారం ఒక ప్రత్యేక రైలు నడుస్తుంది.
రామేశ్వరం నుండి కాచిగూడకు (07192) మే 14వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైలు నడుస్తుంది.

పైన పేర్కొన్న రైళ్లు కాకుండా చర్లపల్లి నుంచి బయలుదేరే ప్రత్యేక రైళ్లు ఇవే
కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు (07446) ఉదయం 7.20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
లింగంపల్లి - కాకినాడ ప్రత్యేక రైలు (07455) 6.30 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి 7.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ మార్పు జూన్ 1 వరకు కొనసాగుతుంది. అలాగే చర్లపల్లి నుంచి భువనేశ్వర్ వరకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

చర్లపల్లికి ప్రయాణికులు సత్వరమే చేరుకునే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇకనుంచి ప్రతి పది నిముషాలకు ఒక బస్సు సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి బయలుదేరుతుంది. అలాగే చర్లపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ప్రతి పది నిముషాలకు బస్సు బయలుదేరుతుంది. రైల్వే అధికారులకు మాత్రం చర్లపల్లికి ఎంఎంటీఎస్ సర్వీసులు నడుపుదామనే ఆలోచన మాత్రం రావటంలేదంటూ ప్రయాణికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎంఎంటీఎస్ లేకుండా చర్లపల్లికి చేరుకునేదెలా? అంటూ తీవ్రస్థాయిలో అధికారుల తీరుపై విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+