హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారులో ఏకాంతంగా యువతితో సీఐ..: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పోలీసులపై దాడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ సీఐ నాగేశ్వరరావు కామోన్మాదం మరువకముందే నగరంలోని మరో ఇన్‌స్పెక్టర్ రాసలీలలు వెలుగుచూశాయి. వనస్థలిపురంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజు వివాహేతర సంబంధాన్ని గుట్టురట్టు చేసింది ఆయన భార్య. యువతితో కారులో సీఐ రాజు ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య అక్కడికి వెళ్లింది. దీంతో అక్కడ గొడవ జరిగింది. అయితే, అక్కడికి వెళ్లిన పోలీసులపైనా సీఐ దాడి చేయడం గమనార్హం.

కారులో ఏకాంతంగా యువతితో సీఐ రాజు

కారులో ఏకాంతంగా యువతితో సీఐ రాజు

ఈ నేపథ్యంలోనే వనస్థలిపురంలో సీఐ రాజును స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో వనస్థలిపురం పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో కారులో ఓ యువతితో ఏకాంతంగా సీఐ ఉండటాన్ని చూసిన భార్య.. ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్ల గొడపడింది. ఇది గమనించిన స్థానిక పోలీసులు.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కానిస్టేబుళ్లపై దాడి చేసిన సీఐ రాజు

కానిస్టేబుళ్లపై దాడి చేసిన సీఐ రాజు

ఈ క్రమంలో సీఐ రాజు.. కానిస్టేబుల్ పై దాడి చేసి, సెల్‌ఫోన్ పగలగొట్టాడు. దీంతో పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన కానిస్టేబుళ్లు.. మరో వాహనంలో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ సీఐగా రాజు పనిచేస్తున్నారు. కాగా, సీఐ దాడిలో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. సదరు సీఐపై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.

సీఐ రాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

సీఐ రాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఈ మేరకు సీఐ రాజుపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్‌గా 10 రోజుల క్రితమే హైదాబాద్ సీసీఎస్ కు బదిలీ కాగా ఇంకా జాయిన్ కాలేదు. ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐ రాజును వనస్థలిపురం పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. కాగా, నిన్న మొన్నటి వరకు సీఐ రాజు మునుగోడు ఎన్నికల డ్యూటీలో ఉన్నాడు. ఇది ఇలావుండగా, ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసులో సీఐ నాగేశ్వరరావు తన ఉద్యోగం కోల్పోయిన విషయం తెలిసిందే.

English summary
south zone control room ci raju arrested for attacking on police and extramarital affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X