వృద్ధుడే యువతితో కాంట్రాక్ట్ పెళ్లికి వరుడు: కేకలేసిన తల్లి, భగ్నం (ఫొటోలు)
హైదరాబాద్: పేదరికం నుంచి బయటపడడానికి యువతిని వృద్ధుడికి ఇచ్చి నిఖా చేయాలని చేసిన ప్రయత్నాన్ని హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు భగ్నం చేశారు. కాసేపట్లో నిఖా జరగాల్సి ఉండగా తన కుమార్తెకు కాబోయే వరుడిని చూసి షాక్ తింది. మునిమనవళ్లు ఉన్న 56 ఏళ్ల వృద్ధుడే కాంట్రాక్ట్ పెళ్లి వరుడని తెలుసుకుని దళారులపై కేకలు వేసింది.
ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో కాంట్రాక్ట్ వివాహం భగ్నమైంది. వివాహానికి సిద్ధపడిన సోమాలియన్‌తోపాటు మరో ముగ్గురు మధ్యవర్తులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
ఇస్మాయిల్, వట్లపల్లి, ఇంజన్‌బౌలి, నైస్ హోటల్‌లో పనిచేసే ఫర్వీన్, అలీ అలీ మహ్మద్, మాదన్నపేట ఈదీబజార్‌కు చెందిన కిరాణా దుకాణం నిర్వహిస్తున్న అన్వరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ బాబురావు, సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆ కాంట్రాక్ట్ మ్యారేజీ తంతంగా ఇలా నడిచింది.

ఇలా ప్రయత్నం
సోమాలియాకు చెందిన అలీ మహమ్మద్ తన కుమారుడు జామ అబ్దుల్లాహి అలీకు పెరాలసిస్ చికిత్స కోసం మెడికల్ వీసాపై నగరానికి వచ్చినిరుడు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి నగరంలోనే ఉంటున్నాడు.

ఇలా ప్రయత్నం
సోమాలియాకు చెందిన ఇస్మాయిల్ మూసే 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థానిక యువతిని పెళ్లాడి, భార్య ఆరుగురు పిల్లలతో టోలీచౌకిలో నివసిస్తున్నాడు.

ఇలా ప్రయత్నం
మూసే ఫలక్‌నూమాకు చెందిన ఫర్వీన అనే మహిళను సంప్రదించాడు. సోమాలియా దేశస్థుడికి కాంట్రాక్ట్ మార్యేజ్ చేస్తే ఇరువురికి కమీషన వస్తుందని ఆశ పడ్డారు. ఈ క్రమంలో ఫర్వీనను ఈదీబజార్‌కు చెందిన అన్వరి కలిసింది.

ఇలా ప్రయత్నం
భవానీనగర్‌కు చెందిన ఫాతిమా మూడో కుమార్తె షాజహాన(26)పెళ్లికి సిద్ధంగా ఉందని అన్వరి ఫర్వీనకి చెప్పింది.

ఇలా ప్రయత్నం
షాజహానను సోమాలియా నుంచి వచ్చిన అలీ అలీ ముహ్మద్‌కు మూడు నెలల కాంట్రాక్ట్ వివాహం చేస్తే మెహర్ కింద లక్షరూపాయలు ఇస్తారని ఫాతిమాను ఒప్పించారు.

ఇలా ప్రయత్నం
లక్ష రూపాయల్లో తమకు 20 వేలు కమీషన చెల్లించాలని ఆమెతో దళారులు ఒప్పందం చేసుకున్నారు. అన్వరి ఇంటికి వరుడు అలీ అలీ మహ్మద్, మధ్యవర్తి మహ్మద్ ఇస్మాయిల్ మూసేలు మంగళవారం వెళ్లారు.

ఇలా ప్రయత్నం
అదే సమయంలో ఫాతిమాకు వరుడిని చూపించారు. అతడి వయస్సు 56 ఏళ్లుండడంతో తన కుమార్తెను అతడికిచ్చి వివాహం చేయటానికి అంగీకరించలేదు.

ఇలా ప్రయత్నం
వృద్ధుడితో పెళ్లి చేస్తున్నారా? అంటూ దళారులపై ఫాతిమా కేకలు వేసింది. ఈ విషయం స్థానికుల ద్వారా మాదన్నపేట పోలీసులకు సమాచారం అందింది. కాంట్రాక్ట్ పెళ్లి గుట్టును పోలీసులు రట్టు చేశారు.












Click it and Unblock the Notifications