ఈ హిల్ స్టేషన్స్ కు వెళ్తే తిరిగి రావాలని అనిపించదు..!
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జూన్ వచ్చినా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఈలోపు ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మనకు దగ్గరలోనే ఉన్న హిల్ స్టేషన్స్ పై ఓ లుక్కేయండి.. కొండల మధ్య దాగి ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్తే అసలు తిరిగి రావాలని అనిపించదు. మరి వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దాగి ఉన్న కూర్గ్ పర్యాటక ప్రాంతం.. భారత్ లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్స్ లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాంతం అంతా కాఫీ తోటలు, జలపాతాలు, పొగ మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. కూర్గ్ లో అబ్బే జలపాతం, రాజాస్ సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, తలా కావేరి, నమద్రోలింగ్ మోనాస్టరీ ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడి కాఫీ తోటల్లో విహరించడంతో పాటుగా ట్రెక్కింగ్ కూడా చేసుకునే వీలుంది.
ఊటీ ప్రాంతాన్ని హిల్ స్టేషన్స్ కు రాణిగా పిలుస్తుంటారు. భారత్ లోని అత్యంత ప్రజాదరణ పొందిన హిల్ స్టేషన్స్ లో ఇది ఒకటి. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నీలగిరి మౌంటెన్ రైల్వే, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్ అలాగే దొడబెట్ట శిఖరం ఇక్కడ చాలా ఫేమస్. అలాగే ఊటీకి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూస్తే కూనూర్, పైకారా జలపాతం, అవలాంచ్ సరస్సు ఇక్కడ చాలా ఫేమస్. ఇక ఊటీని సందర్శించడానికి మార్చి నుంచి జూన్ వరకు అలాగే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు బెస్ట్ సీజన్ గా చెబుతారు.
కర్ణాటకలోని సఖలేశ్ పూర్ పశ్చిమ కనుమలలో ఉంది. ఇది ఓ చిన్న హిల్ స్టేషన్. ప్రశాంతత అలాగే ప్రకృతిని ఇష్టపడేవారికి ఇది ఒక పర్ ఫెక్ట్ డెస్టినేషన్ గా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని హాసన్ జిల్లాల ఊటీగా పిలుస్తుంటారు. సఖలేశ్ పూర్ లో అత్యంత ప్రముఖమైన ప్రదేశం మంజరాబాద్ కోట అలాగే గ్రీన్ రూట్ ట్రెక్కింగ్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ గా నిలుస్తోంది. వీటితోపాటు బిస్లే వ్యూ పాయింట్, మగ్గనహళ్లి జలపాతం, బెట్టద భైరవేశ్వర గుడి చాలా ఫేమస్.

కొడైకెనాల్ ప్రాంతం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో పళని కొండలపైన ఉన్న ఓ హిల్ స్టేషన్. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,133 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతాన్ని హిల్ స్టేషన్స్ యువరాణిగా పిలుస్తుంటారు. దట్టమైన అడవులు, చల్లని లోయలు, సరస్సులు, నిరంతరం కురిసే పొగమంచుతో కొడైకెనాల్ ప్రాంతం పర్యటకులను ఒక సరికొత్త లోకం లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కొడైకెనాల్ లేక్, కోకర్స్ వాక్, బ్రయంట్ పార్క్, పిల్లర్ రాక్స్, గ్రీన్ వ్యాలీ వ్యూ ప్రాంతాలు చాలా ఫేమస్..












Click it and Unblock the Notifications