దోబూచులాడుతున్న రుతుపవనాలు: హైదరాబాద్‌కు మరో 3-4 రోజుల్లో, వారాంతంలో భారీ వర్షాలు

హైదరాబాద్: నగరానికి నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. వర్షాలు రావడానికి ఇంకా మూడు నుంచి నాలుగు రోజులు పట్టవచ్చు. హైదరాబాద్‌ భారత వాతావరణ శాఖ అధిపతి కే నాగరత్న మాట్లాడుతూ.. వర్షాలు దక్షిణ ద్వీపకల్పాన్ని పూర్తిగా కవర్ చేయనందున, రుతుపవనాలు మొత్తం రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వారం మధ్యలోకి వెళ్లవచ్చని అన్నారు.

మరో 3-4 రోజుల్లో హైదరాబాద్‌లోకి రుతుపవనాలు

మరో 3-4 రోజుల్లో హైదరాబాద్‌లోకి రుతుపవనాలు

"ప్రస్తుతం రుతుపవనాలు మరఠ్వాడా వరకు మాత్రమే వ్యాపించి ఉన్నాయి. ఇది ఇంకా పూర్తి దక్షిణ ద్వీపకల్పాన్ని కవర్ చేయలేదు. రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కవర్ చేయడానికి మరో 3-4 రోజులు పడుతుంది" అని నాగరత్న అన్నారు. రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అన్ని షరతులు నెరవేరడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని ఆమె అన్నారు.

తెలంగాణలో వారాంతంలో వర్షాలు

తెలంగాణలో వారాంతంలో వర్షాలు

రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చే సాధారణ తేదీ జూన్ 8. అయితే, హైదరాబాద్‌లో రుతుపవనాలకు ముందు పరిస్థితులు ఏర్పడి, ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు కేవలం 37 డిగ్రీల వద్ద నమోదయ్యాయి. వారాంతంలో ఆకాశం కూడా క్యుములస్ మేఘాలతో నిండి ఉంటుంది. "సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం/రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ ఉత్తరాది జిల్లాల్లో మండే ఎండలే

తెలంగాణ ఉత్తరాది జిల్లాల్లో మండే ఎండలే

ఇదిలా ఉండగా, అధిక ఉష్ణోగ్రతలను చూస్తున్న కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డిలోని మద్నూర్‌లో 86 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది. వాతావరణ కార్యాలయం ప్రకారం.. ఈ వర్షాలు జూన్ 15 నాటికి రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేస్తాయి. అప్పటి వరకు, రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలు అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి. కాగా, నైరుతి రుతుపవనాలు సోమవారమే తెలంగాణలోకి రావాల్సి ఉండగా, ఇంకా కొద్ది రోజులు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+