బీజేపీ, బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఆగిన రాజకీయ పార్టీల నేతల వలసలు మరోసారి ఊపందుకున్నట్లు కనిపిస్తాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీలను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మరోసారి రాజకీయ వలసలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

బీజేపీకి రాజీనామా చేసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బాపురావు. ఆయనతోపాటో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరారు.

Soyam Bapu Rao joins Congress party Atram Sakku

ఈ సందర్భంగా సోయం బాపూరావు మాట్లాడుతూ.. బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినట్లు చెప్పారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని సోయం బాపూరావు చెప్పారు.

ఆదిలాబాద్‌లోని వజ్జర్‌లో 1969 ఏప్రిల్ 28న జన్మించిన సోయం బాపూరావు.. 2004లో బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బోథ్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి రాథో్ బాపూరావు చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బోథ్ నుంచి పోటీ చేసి.. మళ్లీ రాథోడ్ బాపూరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆదిలాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2024 లోక్‌సభ బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+