మోడీ గుండెలో ప్రత్యేక స్థానం: బండి సంజయ్‌పై అన్నామలై ప్రశంసలు

తమిళనాడు బీజేపీ అధ్క్ష్యక్షుడు అన్నామలై తెలంగాణలో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఆదివారంనాడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్‌లో గెలిచి చరిత్ర సృష్టిస్తారని అన్నారు.

దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయని అన్నామలై కొనియాడారు. బండి సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.

Special place for bandi sanjay in pm modi s heart Annamalai

జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు, కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్‌కే సొంతమంటూ ప్రశంసలు కురిపించారు అన్నామలై. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని అన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్‌కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని అన్నామలై విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ వచ్చిన వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామన్నామని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ చెడ్డపేరు వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ పార్టీ రిజర్వేషన్లను రద్దుకు వ్యతిరేకమని, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను యథాతథంగానే అమలు చేయనున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు. మోడీని బడాబాయ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారని, గుజరాత్‌ మోడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారని అన్నామలై గుర్తుచేశారు.

మోడీ పనీతీరును ప్రశంసించిన రేవంత్‌రెడ్డి.. ఎన్నికలు రాగానే మోడీపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ప్రచార సమయంలో గాడిద గుడ్డునే పట్టుకుని తిరుగుతున్నారని, అబద్ధాలు చెప్పిన వారిని గాడిదపై కూర్చోబెడతామని చురకలంటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+