వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీమ్ యాక్షన్ టీమ్ వేట : హత్య చేసేదొకరు.. లొంగిపోయేది మరొకరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హత్యలు.. భూ దందాలు.. సెటిల్మెంట్లు.. నేరాలేవైనా సరే.. చేసేది ఒకరు.. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయేది మరొకరు. ఇదీ గ్యాంగ్ స్టర్ నయీమ్ తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం అనుసరించిన పంథా. యాక్షన్ టీమ్ ఒకరైతే.. సరెండర్ అయ్యే టీమ్ మరొకటి అన్నమాట.

నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన అతని యాక్షన్ టీమ్ ను వెతికే పట్టుకునే పనిలో పడింది పోలీస్ యంత్రాంగం. ఎన్ కౌంటర్ తర్వాత నయీమ్ తో సంబంధాలున్న 20 మందిని ఇప్పటిదాకా పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరంతా సివిల్ నేరగాళ్లే అని తెలుస్తుండగా.. దీనికి భిన్నంగా ఓ ప్రత్యేక యాక్షన్ టీమ్ ను కూడా నడిపించాడు నయీమ్.

Special Police teams searching for nayeems action team

నయీమ్ డైరెక్షన్స్ ను అనుసరిస్తూ.. హత్యలు, కిడ్నాప్ లకు పాల్పడడం అనంతరం అజ్ఞాతంలో అప్పటికే సిద్దం చేసి పెట్టిన షెల్టర్ జోన్స్ కు వెళ్లిపోవడం వీరి కార్యచరణ. ఆ తర్వాత ఈ యాక్షన్ టీమ్ స్థానంలో మరొక టీమ్ ఒకటి రంగప్రవేశం చేసి పోలీసుల ఎదుట లొంగిపోవడం నయీమ్ రూపొందించిన మాస్టర్ ప్లాన్. దీంతో అసలు నేరస్తులు కేవలం కుట్ర వ్యవహారానికే పరిమితమైపోతూ వస్తున్నారు.

ఆ ఏడుగురి కోసం సాగుతోన్న వేట :

నయీమ్ యాక్షన్ టీమ్ లో కీలక వ్యక్తులుగా భావిస్తోన్న ఏడుగురి కోసం ప్రస్తుతం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. నయీమ్ నేర సామ్రాజ్యానికి మరో కొనసాగింపు లేకుండా.. అతని అనుచరులందరిని అణిచేవేయాలనే యోచనలో భాగంగానే ప్రస్తుతం ఈ వేట కొనసాగుతోంది.

ఇక ఆ ఏడుగురు వ్యక్తుల విషయానికొస్తే.. పటోళ్ల గోవవర్దన్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూర్ కేంద్రంగా
నేర కార్యకలాపాలు కొనసాగించిన మాజీ మావోయిస్టు శేషన్న.. నయీమ్ యాక్షన్ టీమ్ లో కీలక వ్యక్తిగా సమాచారం. అలాగే అచ్చంపేటకు చెందిన జహంగీర్, మహబూబ్ నగర్ కు చెందిన చెన్నారం రాజు, సిద్దిపేటకు చెందిన మల్కపురం మహేశ్ (పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్యకు ప్లాన్ చేసిన నిందితుడున్న ఆరోపణలున్న వ్యక్తి) మహబూబ్ నగర్ కు చెందిన దామోదర్ రెడ్డి (ఇతడి సోదరుడు వెంకట్ రెడ్డితో పాటు పటోళ్ల గోవర్దన్‌రెడ్డిని హత్య చేశాడు), హైదరాబాద్‌లోని ముషీరాబాద్ కు చెందిన ఆసిఫ్, పాతబస్తీకి చెందిన ఫెరోజ్..
నయీమ్ యాక్షన్ టీమ్ లో కీలకంగా వ్యవహరించారు.

ఈ ఏడుగురే గాక వీరి కనుసన్నుల్లో పనిచేసిన కిరాయి నేరగాళ్ల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ టీమ్ లను రంగంలోకి దింపింది రాష్ట్ర పోలీస్ యంత్రాంగం.

English summary
Special police teams were searching for Gangster Nayeems action team. After nayeem encounter all they are gone into underground
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X