సికింద్రాబాద్ నుంచి ఈ రూట్ లో డైలీ బతుకమ్మ ప్రత్యేక రైళ్లు: ఈ మధ్యాహ్నం నుంచే

పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ పండగల సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

తాజాగా సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య డైలీ బతుకమ్మ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు. ఈ మధ్యాహ్నమే మొదటి రైలు పట్టాలెక్కుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనుంది. తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే ప్రత్యేక రైలు కావడం వల్ల పండగ పూట తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం 34 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

Special Trains to ease the festive rush between From Secunderabad to Sirpur Kaghaznagar from today

నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12:10 నిమిషాలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరే నంబర్ 07711 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకుంటుంది.

తమిళనాడులో అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు: మెజారిటీ మార్క్ కు చేరువగా టీవీకే?
తమిళనాడులో అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు: మెజారిటీ మార్క్ కు చేరువగా టీవీకే?

తిరుగు ప్రయాణంలో.. నేటి నుంచి 25వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బయలుదేరే నంబర్ 07712 ప్రత్యేక రైలు రాత్రి 11:15 నిమిషాలకు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సికింద్రాబాద్ కే పరిమితం కావట్లేదు. నాంపల్లి స్టేషన్ వరకూ వెళ్తుంది.

9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్
9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్

చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలుకు ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ ఆరంభమైంది కూడా. ఒక ఏసీ ఛైర్ కార్, సెకెండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+