టీపీసీసీ చీఫ్ ఫిక్స్... ఆ నేత పేరే దాదాపుగా ఖరారు..? గండి కొట్టే ప్రయత్నాల్లో ఢిల్లీకి సీనియర్లు!
తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఎడతెగని ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం... సీనియర్లు,జూనియర్లు అన్న స్పష్టమైన గీత కనిపిస్తుండటంతో అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఎదిగొచ్చిన నేతలకు అవకాశం ఇవ్వాలా.. లేక ప్రస్తుత పరిస్థితుల్లో జనం మూడ్‌కి తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలా అన్నది హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే 160 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపించినప్పటికీ... ఎటూ తేల్చలేకనే అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికను జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పటికే ఖరారైపోయిందని... పార్టీలో సీనియర్లను కన్విన్స్ చేసేందుకే అధిష్టానం కాస్త సమయం తీసుకుంటోందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

రేవంత్ పేరు ఫిక్స్..?
కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్‌గా ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగా లీకులు ఇచ్చి... సీనియర్లు కన్విన్స్ అయ్యేందుకు కాస్త టైమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అధిష్టానం పీసీసీ ప్రకటనను ఆలస్యం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ పేరు ఖరారైనట్లు లీకులు అందడటంతోనే సీనియర్ నేతలు ఢిల్లీలో వాలుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బుధవారం(డిసెంబర్ 16) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవగా... జగ్గారెడ్డి,శ్రీధర్ బాబు తదితర సీనియర్ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి... తనకు పదవుల కంటే పార్టీనే ముఖ్యమని చెప్పడం గమనార్హం.

రేవంత్‌కు స్వప్రయోజనాలే ముఖ్యమంటున్న సీనియర్లు...
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే పార్టీ వ్యవహారాలన్నీ వన్ సైడ్ అయిపోతాయని సీనియర్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పైగా రేవంత్‌కు పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని... ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ ఎలాగైతే బండి సంజయ్ లాంటి నిజమైన కార్యకర్తకు అధ్యక్ష పగ్గాలు అప్పగించిందో... కాంగ్రెస్ పార్టీ కూడా తొలి నుంచి పార్టీలో ఉన్న నేతకే పగ్గాలు ఇవ్వాలని వారు కోరబోతున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ వ్యవహారంపై కూడా సీనియర్లు అనుమానంతో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఎంపికకు ఠాగూర్ చేసిన కసరత్తు పారదర్శకంగా లేదని వారు అనుమానిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా రేవంత్‌కు పీసీసీ చీఫ్ దక్కకుండా ఉండేందుకు చివరి నిమిషం దాకా సీనియర్లు అధిష్టానంతో ఫైట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

రేవంత్‌పై ఆర్ఎస్ఎస్ రిమార్క్..?
ఇలా సీనియర్లకు రేవంత్‌కు మధ్య విబేధాలు బయటపడుతున్న తరుణంలో బుధవారం(డిసెంబర్ 16) ఓ లేఖ తెర పైకి వచ్చింది. రేవంత్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని.. ఆ గూటి నుంచి వచ్చిన నేతతో బీజేపీని ఎలా ఢీ కొడతామని అందులో ప్రశ్నించారు. బీజేపీ రేవంత్‌పై సీబీఐ కేసులు కూడా పెట్టాలని చూస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగించిందని... కాంగ్రెస్ కూడా టీపీసీసీ పగ్గాలు బీసీ నేతకు అప్పగించాలని లేఖలో సూచించారు. టీపీసీసీ రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేర్లే ఎక్కువగా ఉండటంతో... బీసీ వర్గానికి చెందిన నేతలు ఈ లేఖను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
Recommended Video

రాహుల్‌తో భేటీ కానున్న రేవంత్...
ఆర్థిక బలం,దూకుడు... ఈ రెండూ టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో రేవంత్‌కు కలిసొచ్చే అంశాలన్న చర్చ జరుగుతోంది. అయితే ఆర్థిక బలం తమకూ ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ ఎంపికపై వాడి వేడి చర్చ జరుగుతున్న తరుణంలో ఒకేరోజు(బుధవారం) రేవంత్,కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. బహుశా ఈ భేటీలోనే పీసీసీ ఎంపికపై ఆయనకు క్లారిటీ ఇవ్వబోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications