ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా..
Recommended Video

హైదరాబాద్: గత వారం, పదిహేను రోజులుగా టీటీడీపీలో సాగుతున్న నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం ద్వారా టీడీపతో తెగదెంపులు చేసుకున్న రేవంత్.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఆ సస్పెన్స్‌కు కూడా తెరదించారు.
టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌లో చేరడానికి ఆయన పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేక ఒకప్పుడు తాను విమర్శించిన నేతలకు ఇప్పుడు తనను విమర్శించే ఛాన్స్ ఇస్తారా? అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఆయన రాజీనామాకే సిద్దపడ్డారు.

నేరుగా కొడంగల్:
అమరావతిలో భేటీ తర్వాత రేవంత్ నేరుగా తన నియోజకవర్గం కొండగల్ వెళ్లే అవకాశముంది. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో రాజీనామా అంశం గురించి ఆయన చర్చించనున్నారు. అయితే అక్కడికి వెళ్లడం కన్నా ముందే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించడం గమనార్హం.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేపథ్యంలో.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రధానంగా ఆయన కొడంగల్ ప్రజలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉపఎన్నిక తప్పదు కాబట్టి ప్రజలు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆయన దృష్టి పెట్టనున్నారు.

విమర్శలు లేకుండా:
తనపై విమర్శలకు తావు లేకుండా ఉండాలంటే.. రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఒకటే మార్గం. ఫైర్ బ్రాండ్ మార్క్ ఉన్న రేవంత్ ఎన్నికల విషయంలోను అదే దూకుడు ప్రదర్శిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. దానిక తగ్గట్టే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తద్వారా తనను విమర్శించేవాళ్ల నోళ్లు మూసినట్టయింది.

రాజీనామా రాజీనామా
ఎటూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేవంత్ అన్నీ సిద్దం చేసుకుంటున్న నేపథ్యంలో.. చేరిక రోజే ఆయన రాజీనామాను ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమైనప్పటికీ.. అప్పటిదాకా ఆయన వేచి చూసే ధోరణితో ఉన్నట్టు లేరు. రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ రాశారు. శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాసిన లేఖను చంద్రబాబుకు కూడా పంపించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా.. ఆయన సమక్షంలో పార్టీలో చేరాలనే యోచనలో ప్రస్తుతం రేవంత్ ఉన్నారు. కాంగ్రెస్ లో చేరిక రోజే తన రాజీనామాపై సస్పెన్స్ బద్దలు కొట్టే అవకాశం ఉంటుందన్నప్పటికీ.. ముందుగానే ఆయన రాజీనామాకు సిద్దపడ్డారు.

రాహుల్ నుంచి ఎలాంటి భరోసా:
ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రేవంత్ ఆయన ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తనకు 40ఎమ్మెల్యేలు సీట్లు కావాలని పట్టుబట్టిన రేవంత్ చివరాఖరికి 15సీట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవాలెంత దానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. అదీగాక కాంగ్రెస్ లో రేవంత్ ప్రాధాన్యం ఎలా ఉండబోతుందన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఉన్న సీఎం అభ్యర్థులను కాదని రేవంత్ ప్రత్యామ్నాయంగా ఎలా మారుతారన్నది చూడాలి.












Click it and Unblock the Notifications