ఏమీ తెలివితేటలు గురూ.. స్పిరిట్, క్యారమిల్‌తో మందు తయారీ, ఎక్సైజ్ పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు
హైదరాబాద్ : సమాజంలో బతికేందుకు మంచి పనులే కాదు చెడు పనులు కూడా ఉన్నాయి. కొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటారు. అలాగే వికారాబాద్ జిల్లాలో ఓ ముఠా .. నకిలీ మద్యం తయారుచేస్తూ డబ్బులు సంపాదించాలనుకొని .. అడ్డంగా దొరికిపోయింది. వికారాబాద్ జిల్లాలో పట్టుబడ్డ ముఠాను విచారిస్తే .. మూలాలు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఆ కోణంలో కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టంచేశారు.
ముఠా గుట్టు రట్టు ..
వికారాబాద్ జిల్లాలో నకిలీ మద్యం ముఠా గుట్టు రట్టయ్యింది. బెస్త లక్ష్మణ్ ఇంట్లో నకిలీ మద్యాన్ని జోరుగా తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో వారి ఇంట్లో దాడులు చేపట్టారు. పరిగి ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. లక్ష్మణ్ ఇంట్లో భారీగా నకిలీ మద్యానికి సంబంధించి స్పిరిట్, క్యారమిల్ లభించాయి. మందుసీసాలు, వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న మూతలు భారీగా పట్టుబడ్డాయి. క్యాప్ సీజన్ మిషన్ కూడా లభించాయి. నకిలీ మద్యం తయారు చేసేందుకు దాదాపు 4 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ లభించింది. మద్యం సీసాలకు పెట్టే 150 లేబుల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. వీరు గత రెండు నెలల నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని విచారణలో తేలింది.

తీగ లాగితే ..
వీరి మూలాలు ఎక్కడ ఉన్నాయి. వీరికి ఎవరూ స్పిరిట్, క్యారమిల్ తయారు చేస్తున్నారు అనే అంశంపై విచారణ చేస్తున్నారు. లక్ష్మణ్ అండ్ కో విచారణలో ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. దీంతో ముఠా ఆగడాలకు కంప్లీట్‌గా చెక్ పెట్టొచ్చన్నారు. ఈ నెల 14న భూదాన్ పోచంపల్లిలో అరెస్టైన నిందితుడి ద్వారా .. నకిలీ మద్యానికి సంబంధించిన సమాచారం తెలిసిందని పోలీసులు చెప్తున్నారు. ఆ మేరకు వికారాబాద్‌లో గల బెస్త లక్ష్మణ్ ఇంట్లో తనిఖీలు చేపడితే నకిలీ మద్యం లభించిందని తెలిపారు. దీంతోపాటు ఇంకా ఎక్కడ నకిలీ మద్యం మూలాలు ఉన్నాయో విచారణలో తేలుతుందన్నారు.












Click it and Unblock the Notifications