Spy Camera in Girls Hostel: గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం..!
Spy Camera in Girls Hostel: రోజురోజుకు మహిళలు, విద్యార్థినిల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దూరప్రాంతాల నుంచి వచ్చి డబ్బులిచ్చి ఆశ్రయం పొందుతున్న హాస్టల్ లో విద్యార్థినులను కూడా దుర్మార్గులు వదలడం లేదు. విద్యార్థినులు ఉంటున్న హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ యజమానే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఈ ఘటన విస్మయానికి గురి చేస్తోంది. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్ లోని లేడీస్ హాస్టల్ లో నిర్వాహకుడు స్పై కెమెరా ఏర్పాటు చేశాడు. స్పై కెమెరాకు మెమొరీ కార్డును అటాచ్ చేసి వీడియోలను స్టోర్ చేశాడు.
కిష్టారెడ్డి పేట పరిధిలోని మైత్రి విల్లాస్ లో బండారు మహేశ్వర్ అనే వ్యక్తి లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ ను నడుపుతున్నాడు. ఆ వసతి గృహంలో 30 మంది అమ్మాయిలు నివాసం ఉంటున్నారు. శుక్రవారం హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు సీక్రెట్ కెమెరాను గుర్తించారు. అనంతరం ఆ అమ్మాయిలంతా కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి హాస్టల్ గదులను వెతకగా.. ఈ వ్యవహారం నిజమేనని నిగ్గు తేల్చారు. సీక్రెట్ కెమెరాలోని పలు మెమోరీ కార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో హాస్టల్ యజమాని బండారు మహేశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సీక్రెట్ కెమెరా వ్యవహారం బయటపడడంతో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ సీక్రెట్ కెమెరాలో తమ ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు.

బండారు మహేశ్వర్ గత నాలుగేళ్లుగా గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నాడు. అయితే ఈ వ్యక్తి తన నీచబుద్ధిని బయటపెట్టాడు. గత నాలుగేళ్లుగా ఈ సీక్రెట్ కెమెరా వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీసులు మూడు సీక్రెట్ కెమెరాలు, చిప్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని విచారిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సీక్రెట్ కెమెరా పెట్టాడా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications