తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా?: శ్రవణ్, యూటీ అంటే ఇబ్బందులేనన్న విష్ణు
హైదరాబాద్: ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టం సాధించుకున్నది పెట్టుబడిదారీ విద్యావ్యవస్థను ప్రోత్సహించేందుకా? అని కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. సేవ్‌మెరిట్ సొసైటీ ఆధ్యర్యంలో ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్‌పై హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఎమ్మెల్యే సంపత్, కాంగ్రెస్ నేత శ్రవణ్ హాజరై మాట్లాడారు.
ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నది పెట్టుబడిదారీ విద్యావ్యవస్థను ప్రోత్సహించేందుకు కాదని శ్రావణ్ అన్నారు. 1750 మెడికల్ సీట్ల భర్తీలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా 134 కాలేజీల్లో రెన్యువల్స్ ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు.

పేదలకు ఇళ్లు కట్టివ్వాలి: విష్ణువర్ధన్‌రెడ్డి
హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోల లీజులను రద్దుచేసి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖైరతాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన హమాలీల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు.
సెక్షన్-8పై గందరగోళం కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. సెక్షన్-8పై టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ప్రజలకు స్పష్టత ఉందని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications