Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి కంటే జగన్ సీనియర్, ఫ్యాన్స్ ఏకమైతే అంతే: పవన్ కళ్యాణ్‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Recommended Video

    Sri Reddy Counter On Nagababu Comments About Balakrishna | Filmibeat Telugu

    హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అనే అర్హత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.

    దొంగకోళ్లు పట్టేవాడిలా ఉంటారు

    దొంగకోళ్లు పట్టేవాడిలా ఉంటారు

    శ్రీరెడ్డి మాట్లాడుతూ... ఇప్పుడే తనకు కొంతమంది ఏపీ నుంచి ఫోన్ చేసి చెప్పారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దొంగచూపులు చూసుకుంటూ, దొంగకోళ్లు పట్టేవాడిలా ఉంటారని చెబుతున్నారని, చదువురాక ఒకటికి రెండుసార్లు, ఇక్కడి పేర్లు అక్కడ, అక్కడి పేర్లు ఇక్కడ చెప్పి, మహానుభావుల పేర్లు తప్పుగా వాడి తప్పులో కాలేస్తుంటారట అని, ఎప్పుడూ బట్టి పట్టుకుంటారని చెబుతున్నారని, అలాగే లక్షలాది పుస్తకాలు చదివారని చెబుతారని అంటుంటారని, కానీ జీవితకాలం చదివినా అన్ని పుస్తకాలు చదవలేరని చెబుతున్నారని అన్నారు.

    చిరంజీవికంటే జగన్ సీనియర్, అలాంటి వ్యక్తిని అనే స్థాయి ఉందా

    చిరంజీవికంటే జగన్ సీనియర్, అలాంటి వ్యక్తిని అనే స్థాయి ఉందా

    ఎప్పుడూ అబద్దాలు చెప్పుకుంటూ, పెళ్లిళ్ల పైన పెళ్లిళ్లు చేసుకుంటూ, దేశసేవ అనే డైలాగులు కొట్టుకుంటూ ఎన్నికల ముందు బయటకు వచ్చి ఏవేవో సొల్లు చెప్పి అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటారని శ్రీరెడ్డి అన్నారు. జగన్ రాజకీయాల్లో చాలా సీనియర్ అని, మీ అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లోకి (ప్రజారాజ్యం) రాకముందే ఆయన (జగన్) రాజకీయాల్లో ఉన్నారని, అలాంటి వ్యక్తిని అనే స్థాయికి పవన్ వెళ్లిపోయారని విమర్శించారు. జగన్ పులి అన్నారు. ఆయనను చూసి పవన్ కళ్యాణ్ వాతలు పెట్టుకోవద్దన్నారు.

    జగన్ అభిమానులు ఏకమైతే మీరు ఏమూలకు

    జగన్ అభిమానులు ఏకమైతే మీరు ఏమూలకు

    అసలు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏకమైతే మీరు (పవన్ కళ్యాణ్) ఏమూలకు ఉండరని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో బిల్లిబిత్తర పిల్లలను, పన్నెండు, పదమూడేళ్ల పిల్లలను వేసుకొని సోది చెప్పి, వాళ్లతో అరిపించుకున్నంత మాత్రాన రాజకీయంగా బలంగా ఉన్నట్లు కాదన్నారు. దానిని చూసి మీరు (పవన్ కళ్యాణ్) ముఖ్యమంత్రిగా వస్తారని అనుకునేంత బుల్ షిట్ మరొకటి లేదేమో అన్నారు.

    అమ్మాయిల పిచ్చిలేదంటూనే

    అమ్మాయిల పిచ్చిలేదంటూనే

    దానికి తగినట్లు అమెరికాకు డబ్బుల కోసం వెళ్లలేదని చెప్పడం, ఆ తర్వాత అడ్డంగా దొరికేశారని, అదే సమయంలో తమకు కులం పిచ్చి లేదంటూనే మీ కులం వాళ్లకే సీట్లు ఇచ్చుకోవడం, వారిని మెప్పించే కార్యక్రమాలు చేయడం, అమ్మాయిల పిచ్చి లేదనుకుంటూనే అమ్మాయిల వెనుక తిరగడం.. ఇంకా మీరు చేసిన చాటింగ్‌లు.. అబ్బబ్బా.. మీరా పవన్ గారు అంటే, మాకు తెలియదండి.. ఎంత గొప్పవారో ఇప్పుడే తెలుస్తోందని, మీ జీవితం తెరిచి చూస్తే యూత్ ఏం నేర్చుకోవాలో చెప్పాలన్నారు.

    ఇంత ఉదాత్తమైన వ్యక్తి

    ఇంత ఉదాత్తమైన వ్యక్తి

    మీరు చేసుకున్న పెళ్లిళ్లను నేర్చుకోవాలా, ఎన్నికల ముందు వచ్చి ప్రభుత్వం ఇది చేయలేదు, అది చేయలేదని విమర్శలు చేయాలా అన్నారు. నోరు తెరిస్తే ఈ మాటలు తప్ప ఏమీ చెప్పలేరని, ఆయనేనే పవన్ కళ్యాణ్ అంటే అని శ్రీరెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే.. ఒకే.. ఇంత ఉదాత్తమైన వ్యక్తి మీరా, బాలయ్య బాబు గారు అంటే తెలియని మనిషులు మీ ఇంట్లో ఉన్నారంటే.. ఏమనాలని అభిప్రాయపడ్డారు. మీరు పెట్టుకున్న పార్టీలు.. అమ్మేసుకోవడం.. అయ్యయ్యో.. అమ్మేసుకోవడం ఏమిటి.. కలిపేసుకునే మీరు జగన్ గురించి, చంద్రబాబు గురించి, బాలయ్య బాబు గురించి మాట్లాడటం.. మీ ఫ్యామిలీకే చెల్లిందని చెప్పారు. హ్యాట్సాప్ అన్నారు. మీ అంత గొప్పోళ్లు, నీచమైన.. అయ్యయ్యో..సారీ.. పెద్ద మనస్తత్వం ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+