పుట్ట మధుకు శ్రీధర్ బాబు కౌంటర్: మీ కూతురు సరే.. జుట్టు పట్టుకొని నిలదీస్తామని కేసీఆర్‌కు రేవంత్
మంథని: తెరాస నేత, మంథని ఎమ్మెల్యే పుట్టా మధు తన పైన చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీధర్ బాబు మంగళవారం నాడు ఖండించారు. నయీంతో తనకు సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేసినందున పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.
పుట్టా మధు ఆరోపణలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణకు కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్యాంగ్ స్టర్ నయీం అంశం పైన సిబిఐతో నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు సరికావన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బురద జల్లుతున్నారన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట భంగపరిచినందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కాగా, శ్రీధర్ బాబుకు నయీంతో సంబంధాలు ఉన్నాయన్న పుట్టా మధు వ్యాఖ్యల పైన కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. తెరాస ఎమ్మెల్యేలకు, మంత్రులకే సంబంధాలు ఉన్నాయని జయశంకర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

మీ బిడ్డ కవితకు రూ.15 కోట్లిచ్చారు సరే: రేవంత్ రెడ్డి
తన కూతురు కవిత బతుకమ్మ ఆడతానంటే సీఎం కేసీఆర్ రూ.15 ఇచ్చారని, బిడ్డ పైన ఉన్న ప్రేమ పేదబిడ్డల మీద లేదా అని టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్బీనగర్‌లో టీడీపీ చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.
రేవంత్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద పిల్లలు మంచి చదువులు చదువుకోవద్దా అని ప్రశ్నించారు. ఫీజు బకాయిలు ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం జుట్టు పట్టుకుని నిలదీస్తామన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications