చిరు కూతురు శ్రీజ పెళ్లి: కెటిఆర్‌కు శుభలేఖ, పవన్ కళ్యాణ్ వస్తున్నారా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహం సందర్భంగా బెంగళూరు నగరంలో ఆ కుటుంబం సందడి కనిపిస్తోంది. చిరంజీవి దంపతులు శుక్రవారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు.
శ్రీజ వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కె తారక రామారావును సిని నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావుతో కలిసి వచ్చిన అల్లు అరవింద్.. కెటిఆర్‌కు శుభలేఖ అందించారు.

మరోవైపు, చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు రిసార్టు చేరుకొని వివాహ ఏర్పాట్లలో మునిగిపోయారు. చిరంజీవి ఆహ్వానం మేరకు కర్నాటక మంత్రి, నటుడు అంబరీష్ కూడా రిసార్టుకు వచ్చారు. కన్నడ సినీ రంగం నుంచి ఎవరెరిని వివాహ వేడుకకు ఆహ్వానించాలనే అంశంపై వీరు చర్చంచారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజలు శనివారం బెంగళూరు చేరుకున్నారు. అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆదివారం రానున్నారని తెలుస్తోంది. సోమవారం జరిగే వివాహ వేడుక కోసం ప్రకృతి రిసార్టును అందంగా అలంకరించారు. సర్దార్ గబ్బర్ సింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్ రాకపోవచ్చునని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ రోజు బెంగళూరు చేరుకుంటారని చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications