మధుప్రియ భర్త శ్రీకాంత్‌పై దాడి: రాత్రంతా ఆమె ఇంటి చుట్టూ చక్కర్లు?

హైదరాబాద్: తనపై దాడి జరిగిందని గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్‌ ఫిర్యాదు చేశారు. గత అర్థరాత్రి తనపై మధుప్రియ ఇంటి వద్ద దాడి జరిగిందని ఆయన ఆరోపించాడు. తన భార్య మధుప్రియను తీసుకొచ్చేందుకు అత్తగారింటికి వెళ్లిన శ్రీకాంత్‌పై మధుప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారని చెప్పారు.

Also Read: సింగర్ మధుప్రియ: శ్రీకాంత్ ప్రేమలో ఎలా పడిందంటే?

రామంతపూర్‌లోని ఆమె ఇంటి వద్ద తనపై దాడి జరిగిందని అక్కడి నుంచి రాత్రి జూబ్లీహిల్స్ వచ్చిన శ్రీకాంత్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం అతనికి యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. తన భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నట్లు మధుప్రియ శనివారం నగరంలోని హుమాయున్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Srikanth says he has been attacked at Madhu Priya residence

తలకు గాయాలతో జూబ్లీహిల్స్ వచ్చిన శ్రీకాంత్ మీడియాకు తనపై దాడి జరిందన్న విషయాన్ని చెప్పాడు. కాగా, బైకులపై మిత్రులతో కలిసి రామంతపూర్‌లోని మధుప్రియ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టినట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలావుంటే, శ్రీకాంత్ అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దాడికి దిగినట్లు మధుప్రియ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి తమ ఇంటికి వచ్చిన శ్రీకాంత్ తనపై వేధింపుల కేసు ఎందుకు పెట్టావంటూ నానా హంగామా సృష్టించాడని వారు ఫిర్యాదు చేశారు.

Also Read: నాటకీయ పరిణామాల మధ్య ఒక్కటైన మధుప్రియ-శ్రీకాంత్

Srikanth says he has been attacked at Madhu Priya residence

అసభ్యపదజాలంతో దూషిస్తూ తమను కొట్టే ప్రయత్నం చేశాడని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+