సంగీతపై మళ్లీ దాడి: ఈసారి మరిది, అత్తమామలు?, తమ్ముడు వచ్చినందుకే!
హైదరాబాద్: భర్త, అత్తారింటి నుంచి గత కొన్నాళ్లుగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్న సంగీతపై మరోసారి అత్త మామలు, మరిది దాడికి దిగారు. దీంతో సంగీత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగీత ఫిర్యాదు మేరకు . మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పు మేరకు సంగీత భర్త ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
Recommended Video


భర్త ఇంట్లోనే ఉంటున్న సంగీత..:
భర్త తనను ఇంటి నుంచి గెంటేయడమే కాక, మరో యువతిని వివాహం చేసుకోవడంతో భర్త ఇంటి ఎదుటే సంగీత ఇన్నాళ్లు న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. అయితే కోర్టు తీర్పు మేరకు ఆమె ఎట్టకేలకు తిరిగి భర్త ఇంట్లో అడుగుపెట్టారు. బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో భర్త, టీఆర్‌ఎస్ మాజీ నేత కె.శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆమె ఉంటున్నారు.

ఆదివారం దాడి:
ఆదివారం సాయంత్రం సంగీత వద్దకు ఆమె తమ్ముడు రంజిత్ రెడ్డి వచ్చారు. దీంతో ఇక్కడికెందుకు వచ్చావంటూ మద్యం మత్తులో ఉన్న సంగీత మరిది శ్రీధర్ రెడ్డి అతనిపై దాడికి దిగారు. దాడి సమయంలో.. సంగీత దాన్ని వీడియో తీస్తుండగా అత్తమామలు, మరిది ఆమెపై దాడికి యత్నించారు. దీంతో సంగీత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త వేధింపులు:
బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి పూలకండ్ల శ్రీనివాస్‌రెడ్డి శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీకి చెందిన సంగీతను 2013లో వివాహం చేసుకున్నాడు. అయితే అంతకుముందే అతనికి మరో వివాహమైన విషయాన్ని దాచిపెట్టాడన్న ఆరోపణలున్నాయి. సంగీతకు ఆడపిల్ల పుట్టడంతో గతేడాది నవంబరు 19న ఇంటి నుంచి గెంటేశాడు. అప్పటినుంచి ఆమె భర్త ఇంటి ఎదుటే న్యాయపోరాటానికి దిగింది.

వదిలించుకోవడానికేనా?:
మహిళా సంఘాలు, రాజకీయ నాయకుల చొరవతో సంగీత చేసిన న్యాయపోరాటానికి కోర్టు కూడా బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు మేరకు ఆమె భర్త ఇంట్లోనే ఉంటుండటంతో.. తిరిగి ఆమెను వదిలించుకోవడానికి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజా దాడి అందుకు ఊతమిచ్చేలా ఉందంటున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications