భార్యపై ఊహించని ప్రేమ, గుడికి తీసుకెళ్ళి.....
అనుమానంతో భార్యను హత్య చేసి, ఆమె కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ భర్త. అయితే ఈ ఘటనలో భర్తే హంతకుడుగా చివరకు పోలీసులు తేల్చారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది.
హైదరాబాద్: అనుమానంతో భార్యను హత్య చేసి, ఆమె కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ భర్త. అయితే ఈ ఘటనలో భర్తే హంతకుడుగా చివరకు పోలీసులు తేల్చారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది.
రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ మండలం పలుగుతండాకు చెందిన శ్రీరామ్‌కు భార్య లలిత, ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల మహేశ్వరం మండలం తుక్కుగూడకు వచ్చి శ్రీరామ్ చిన్న పనిచేస్తున్నాడు.
అయితే ఆయన భార్యపై అనుమానం పెంచుకొన్నాడు. ఈ అనుమానంతో ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. అయితే రెండు వారాలుగా తాను మారిపోయినట్టుగా ప్రవర్తించాడు.
భార్యపై అతి ప్రేమ చూపడం ప్రారంభించాడు. అయితే భార్య కూడ తన భర్తలో మార్పు వచ్చిందని సంబరపడింది.అయితే గత నెల 31వ, తేదిన శ్రీరామ్ భార్యను యాచారం మండలం తాటికొండ అటవీ ప్రాంతంలోని మైసమ్మ ఆలయానికి తీసుకెళ్ళాడు.

అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో భార్యను కిరాతకంగా చితకబాది హత్య చేశాడు. అక్కడే ఆమెకు చీరతో చెట్టుకు ఉరేశాడు.
అయితే తన భార్య ఆచూకీ కన్పించడం లేదంటూ ఈ నెల 2వ, తేదిన శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును విచారించిన పోలీసులు శ్రీరామ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాన్ని శ్రీరామ్ వెల్లడించారు.
గురువారం సంఘటనా స్థలానికి వెళ్లఇ పరిశీలిస్తే కుళ్ళినస్థితిలో లలిత మృతదేహం దొరికింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications