వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: మే నెలలోనే పదో తరగతి పరీక్షలు, బుధవారం నుంచి ఇంటర్ వాల్యుయేషన్: కేసీఆర్

|
Google Oneindia TeluguNews

పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. హైకోర్టు నిబంధనల మేరకు... ఈ నెలలోనే కండక్ట్ చేస్తామని చేస్తామని చెప్పారు. కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ.. పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. 2500 సెంటర్లు ఉండేవని.. వాటిని 5500 సెంటర్లలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అక్కడ విద్యార్థులు భౌతికదూరం పాటించాలని.. శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. మాస్క్‌లు కూడా అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో ఎగ్జామ్ సెంటర్లకు తరలిస్తామని.. ధనవంతుల పిల్లలను కార్లలో వెళ్లేందుకు పాసులు అందజేస్తామని చెప్పారు.

ssc exams will conduct may month only: cm kcr

ఇంటర్మీడియట్ పరీక్షలు పేపర్లను బుధవారం నుంచి వాల్యుయేషన్ చేస్తామని పేర్కొన్నారు. నెక్ట్స్ సిలబస్ ఇయర్ గురించి ఇప్పటికీ స్పష్టత లేదు అని చెప్పారు. కరోనా వైరస్ రేపో, ఎల్లుండో మన నుంచి వెళ్లిపోదని.. మనతోనే ఉంటదని.. వేటాడుతూనే ఉంటుందని.. ఉపాయంతో రక్షించుకోవాలని సూచించారు. బుధవారం నుంచి భూముల కొనుగోలు, అమ్మకాలు ప్రారంభవవుతాయని కేసీఆర్ చెప్పారు. కానీ అక్కడ కూడ భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. భవన నిర్మాణం కోసం ఇసుక అవసరం అని.. ఇసుక కూడా మైనింగ్ చేపడుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ పనిచేసేందుకు అనుమతిస్తునున్నామని.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు.

Recommended Video

Viral Video : Watch How People Are Crazy To Get Wine | Oneindia Telugu

రాష్ట్రంలో ఉన్న నిరుపేద అడ్వకేట్లను ఆదుకునేందుకు రూ.25 కోట్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అడ్వకేట్ జనరల్, ఫైనాన్స్ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ సభ్యులుగా.. సీజేఐ నేతృత్వంలో నగదు అందించేలా హక్కులను ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 10 వేల మంది యువ న్యాయవాదులకు మేలు జరుగుతోందని చెప్పారు.

English summary
ssc exams will conduct may month only cm kcr said. inter paper valuation start on wednesday onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X