తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ కలకలం: టీచర్ సెల్‌ఫోన్ నుంచే?

వికారాబాద్: తెలంగాణలో ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అధికార భారత్ రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోన్నాయి. దీనిపై దర్యాప్తు జరిపించడానికి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. ఇందులో టీఎస్‌పీఎస్సీ బోర్డ్ సభ్యులను కూడా సిట్ విచారించింది.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా పదో తరగతి పరీక్ష ప్రశ్రాపత్రం కూడా లీక్ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఉదయం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సప్‌లల్లో చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. ఏడు నిమిషాల్లోపే ఈ ప్రశ్నాపత్రం వాట్సప్‌ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ పేపర్ లీక్ చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

SSC Paper leak in Telangana: Telugu question paper went viral on Whats App

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బందెప్ప మొబైల్ ఫోన్ నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. బందెప్పతో పాటు తాండూరు మండల విద్యాశాఖాధికారి వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తోన్నారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదంటూ వికారాబాద్ డీఈఓ వివరణ ఇస్తోన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నాపత్రం.. విద్యార్థులకు ఇచ్చినది రెండూ ఒక్కటేనని పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు బందెప్ప, వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గకముందే ఇప్పుడు మళ్లీ ఎస్‌ఎస్సీ పరీక్ష పత్రం కూడా లీక్ కావడం విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు సైతం దీనిపై మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. అటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. సమగ్ర నివేదిక అందజేయాలంటూ వికారాబాద్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+