షురువైన లొల్లి.. ఎక్కెక్కి ఏడ్పులు.. ఇద్దరు అందగత్తెల మద్య ఆర్గ్యూమెంట్..! రసవత్తరంగా బిగ్ బాస్3..!!

హైదరాబాద్ : బిగ్ బాస్ సీజ‌న్ 2 ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అన్న అంశం పక్కన పెడితే బిగ్ బాస్3 మాత్రం ప్రారంభమయ్యి రెండు రోజులు కాక ముందే ఆసక్తికర సన్నివేశాలు సాక్షాత్కరిస్తున్నాయి. గత సీజన్ లో కౌశిక్ ఆర్మీ పుణ్య‌మా అని సాగిన ర‌చ్చ ఏపాటిదో తెలిసిందే. బిగ్ బాస్ ను సైతం కంట్రోల్ చేసి, ఫ‌లితం త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో కౌశిక్ స‌క్సెస్ అయ్యార‌న్న మాట బ‌లంగా నాటుకుపోయిన సంగ‌తి కూడా తెలిసిందే. గ‌త అనుభ‌వంతో ఈసారి మాత్రం ఎవ‌రికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకున్నారో ఏమో కానీ, మొద‌టి రోజు నుంచే ఇంటి స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టే ప్లాన్ ను ద్విగ్విజ‌యంగా అమ‌లు చేశార‌ని చెప్పాలి. మొద‌టిరోజే.. నామినేట్ చేయ‌టం ద్వారా బిగ్ బాస్3 హీట్ పెంచిందనే చర్చ జోరుగా సాగుతోంది.

Recommended Video

    బిగ్ బాస్ వివాదం.. హీరో ఇంటిని చుట్టుముట్టిన విద్యార్థి దళం
     రెండో రోజే ఫుల్ హీట్..! అందగత్తెల సంవాదాలతో అట్టుడికిన బిగ్ బాస్3..!!

    రెండో రోజే ఫుల్ హీట్..! అందగత్తెల సంవాదాలతో అట్టుడికిన బిగ్ బాస్3..!!

    ఆట ఆడేందుకు వ‌చ్చిన‌ప్పుడు.. ఫోక‌స్ అంతా ఆట మీదే ఉండాలే త‌ప్పించి.. అప్పుడెప్పుడో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న వేళ‌ల్లో స‌ద‌రు వ్య‌క్తులు చేసిన ప‌నుల్ని ప్ర‌స్తావించ‌టం.. దాని విష‌యంలో నోరు పారేసుకోవ‌టం చేయ‌కూడ‌దు. కానీ.. ఆ లైన్ ను క్రాస్ చేసిన శ్రీ‌ముఖి తీరు ఇప్పుడు బిగ్ బాస్3 లో ఆస‌క్తిక‌రంగా మారింది. షోలో తాను మిగిలిన వారి కంటే ప్ర‌త్యేకంగా నిల‌వాల‌ని త‌పిస్తుందో.. లేదంటే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాల‌నుకుంటుందో కానీ.. తొలి రెండు రోజుల్లోనే క‌య్యానికి కాలు దువ్విన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన శ్రీ‌ముఖి వ్యవహారం బిగ్ బాస్3లో ఆస‌క్తిక‌రంగా మారింది.

     శ్రీముఖి తొందరపాటు..!వ్యక్తిత్వాల గురించి నోరుపారేసుకున్న యాంకర్..!!

    శ్రీముఖి తొందరపాటు..!వ్యక్తిత్వాల గురించి నోరుపారేసుకున్న యాంకర్..!!

    నామినేట్ చేసిన స‌భ్యులు.. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎవ‌రో ఒక‌రిని రిప్లేస్ చేయ‌టం.. దానికి అనుగుణంగా ప‌స ఉన్న వాద‌న‌ను వినిపించి.. జ‌డ్జిగా ఉన్న హేమ చేత అవున‌నిపిస్తే చాలు నామినేట్ గండం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌న్న అవ‌కాశాన్ని వాడుకునే విష‌యంలో శ్రీ‌ముఖి అనుస‌రించిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. శ్రీ‌ముఖి వంతు వ‌చ్చిన వేళ‌.. త‌న‌కు బ‌దులు హిమ‌జ‌ను రీప్లేస్ చేయాల‌నుకున్న‌ట్లు చెప్ప‌టం.. ఎందుక‌న్న దానికి హిమ‌జ లైఫ్ లో అన్ని విష‌యాల్ని లైట్ గా తీసుకుంటుంద‌న్న మాట‌ను చెప్పింది.

     ఎక్కెక్కి ఏడ్చిన హిమజ..! బిత్తర పోయిన తోటి కాంటెస్టెంట్లు..!!

    ఎక్కెక్కి ఏడ్చిన హిమజ..! బిత్తర పోయిన తోటి కాంటెస్టెంట్లు..!!

    హిమ‌జ‌ గురించి త‌న‌కు తెలుసంటూ వాద‌న వినిపించింది. ఆమెతో క‌లిసి తాను సినిమా కూడా చేశాన‌ని.. ఆమె గురించి బాగా తెలుస‌న్న శ్రీ‌ముఖి మాట‌ల‌కు హిమ‌జ క‌న్నీళ్లు పెట్టుకుంది. కెరీర్ ప‌రంగా త‌న గురించి తెలుసు కానీ వ్య‌క్తిగతంగా ఏం తెలుస‌ని ఇలా రెడ్ మార్క్ వేస్తార‌ని వాపోయింది. బిగ్ బాస్ షోలో పాల్గొనే వారు గ‌తంలో త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్నా.. వారికి సంబంధించి త‌మ మ‌న‌సులో ముద్రించుకు పోయిన భావాల్ని ప్ర‌స్తావించ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మొత్తానికి త‌న మాట‌ల‌తో శ్రీ‌ముఖి సేవ్ అయినా.. హిమ‌జ‌ను మాట‌ల‌తో అలా మాట్లాడేసే విష‌యంలో అవ‌స‌రానికి మించిన దూకుడుత‌నాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్న భావ‌న క‌లిగించేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

     ఎంత త్యాగమో..! బిగ్ బాస్3 కోసం మేకప్ కి దూరంగా శ్రీముఖి..!!

    ఎంత త్యాగమో..! బిగ్ బాస్3 కోసం మేకప్ కి దూరంగా శ్రీముఖి..!!

    యాంకర్ శ్రీముఖి. అల్లరికి మారుపేరు. సౌండుకు డిజైనర్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అదే శ్రీముఖి. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనంతట తాను బంధీ అయ్యి... అందరదినీ కేరింతలు కొట్టిస్తోంది. ఎపుడూ ఫుల్ మేకప్ తోనే చూసిని శ్రీముఖి... ఇలా వితౌట్ మేకప్ తో కూడా చూడండి. మరీ మేకప్ లేకుండా కష్టం గానీ కొన్ని టచప్ లు పడ్డాయంటున్నారు కొంత మంది మేకప్ నిపుణులు. అదే కోవలో సావిత్రి. అర్థకిలో మేకప్, సౌరం కట్టుకోంది బలయటకు రావని సావిత్రి గురించి అప్పుడప్పుడు బిత్తిరి సత్తి చేసే వ్యాఖ్యలు కూడా పచ్చి వాస్తవాలని నిరూపిస్తోంది సావిత్రి. మేకప్ లేకపోతే అలా కనిపిస్తోంది మరి మన సాఫిత్రి అక్క..!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+