బడ్జెట్‌ను ఆమోదించిన తెలంగాణ కేబినెట్: నేడే అసెంబ్లీలో ప్రవేశం

ప్రగతిభవన్‌లో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చలు జరిపారు. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ భేటీ ముగియడంతో సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లారు.

ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. కాగా, నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపు పది నిమిషాలకు పైగా ఈ కేబినెట్ సమావేశం జరిగింది.

state budget approved in telangana cabinet meeting chaired by cm kcr

అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరూ తప్పకుండా హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహన, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్ భేటీలో మార్గనిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.

ఎన్నికలు ఏడాది కావడంతో మరోమారు భారీ పద్దునే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకుని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం భారీ అంచనాలతో రూ. 2.52 లక్షల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+