ALERT: అలా చేస్తే ఇకపై లైసెన్సులు రద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ నిర్ణయం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు బిగ్ అలెర్ట్. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. ఐదు లేదా ఆరు సార్లు నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వాటిని ఎప్పటికీ పునరుద్ధరించమని.. వారు తరువాత ఏవైనా వాహనాలు తీసుకుంటే వాటికి రిజిస్ట్రేషన్లు చేయమని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు పొన్నం సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియపై కమిటీని ఏర్పాటు చేస్తామని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పొన్నం ప్రభాకర్ బదులిచ్చారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. కార్మికులు సమ్మె చేసినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కనికరం చూపలేదని విమర్శించారు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రేవంత్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంగించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications