పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెడతా- సర్పంచ్ ఇంటికి వెళ్లిన MLA
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా సర్పంచ్ ఇంటికి వెళ్లారు. తనను వేధిస్తున్నాడని ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా సర్పంచ్ ఇంటికి వెళ్లారు. తనను వేధిస్తున్నాడని ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నేరుగా ఇంటికి వెళ్లి మాట్లాడారు ఎమ్మెల్యే రాజయ్య. అయితే.. పార్టీ అధిష్ఠానం నవ్య దంపతులతో మాట్లాడిందని... నవ్వ భర్త ఆహ్వానం మేరకే.. ఇంటికి వచ్చినట్టు చెప్పారు.
పార్టీలో అప్పుడప్పుడు ఇలాంటి అరమరికలు వచ్చినప్పుడు మాట్లాడుకుని సరిదిద్ధుకోవాల్సిన అవసరం ఉందని, అయితే.. నవ్యను తానెప్పుడు చిన్నచూపు చూడలేదని.. పక్కకు పెట్టలేదన్నారు. తన వల్ల తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగితే దిద్దుకోవాల్సిన భాద్యత తనపై ఉందన్నారు. ఇన్ని రోజులు జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని, పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణలు చెపుతున్నాన్నారు. ఈ నేపథ్యంలోనే.. ధర్మసాగర్ గ్రామాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రభుత్వ నిధుల్లో రూ. 25 లక్షల నిధులు తక్షణమే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకు ముందు మాట్లాడిన సర్పంచ్ నవ్య.. అన్యాయం, అక్రమం ఎక్కడ జరిగినా తాను ఖండిస్తానని, ఎవరికివ్వాల్సిన విలువ వారికివ్వాల్సిందేనని.. చిన్నచూపు చూసినా, వివక్షకు గురి చేసినా.. సహించనన్నారు. తాను మాట్లాడే ప్రతి మాట నిజమేనని, వేధింపులకు గురి చేసే వారి భరతం పడతానని రాజయ్య ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చి వేశాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరించారు. రాజయ్యపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు మాత్రం కుటుంబంలో ఎవరైనా తప్పుచేస్తే క్షమించాల్సిన పరిస్థితి వస్తుందంటూ దాటవేశారు. గ్రామాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తారో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు.
"మహిళలకు అన్యాయం జరుగుతోందని, కొందరి చేతుల్లో మహిళలు మోసపోతున్నారని, మహిళలపై వేధింపులు, అరాచకాలు జరిగితే సహించొద్దని నవ్య వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలను కూడా లైంగికంగా వేధిస్తున్నారని, పార్టీలో తనకు విలువ ఉందని, ఎమ్మెల్యే రాజయ్య కారణంగానే సర్పంచ్ అయ్యానన్నారు. పార్టీకి కట్టుబడి ఉంటాను, పార్టీ నాకు అండగా ఉండాలి.. స్థాయిని చూసి, అణచివేయొద్దు.. డబుల్ గేమ్‌లు ఆడొద్దు.. వేధించిన వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా అంతు చూస్తా అన్నారు. ఇంటిలోనూ, పార్టీలోనూ మంచి, చెడు ఉంటుందని, కష్టం వస్తే ఎమ్మెల్యే రాజయ్య తోడుగా ఉండాలని, తనకు అన్యాయం జరిగింది కానీ వాళ్లను క్షమిస్తున్నా." ని సర్పంచ్ నవ్య మాట్లాడారు. నవ్య చేసిన ఆరోపణలను రాష్ట్ర మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఎమ్మెల్యే రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్టు ట్విట్టర్ వేదికగా మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications