పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నుంచి హాట్ మహిళా ఎమ్మెల్యే వరకు...!
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద ట్వీట్లతో నిత్యం చర్చనీయాంశంగా మారారు. ఆయన ఏ ట్వీట్ చేసినా అది సంచలనం అవుతోంది. తాజాగా, ఆయన దృష్టి రాజకీయాల పైన పడింది. అసోం బీజేపీ మహిళా ఎమ్మెల్యేల పైన, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైన ట్విట్టర్లో స్పందించారు.
వర్మ ఎప్పుడూ కాంట్రోవర్సీని క్రియేట్ చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఇటీవల ఆయన ప్రధానంగా టాప్ హీరోలను టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కొద్ది రోజుల క్రితం ఆయన టార్గెట్ చేశారు.
సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందు, విడుదల తర్వాత వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ తీరును కూడా వర్మ తప్పుబట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం పైన కూడా ఆయన తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

తాజాగా, అసోం ఎమ్మెల్యే, బీజేపీ నేత అంగూర్ లతా పైన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఆమె పైన అతను సెక్సిజం కామెంట్లు చేశారు.
అంతకుముందు, అంగూర్ లతా మాట్లాడుతూ..ఓ సెలబ్రిటీగా సమాజంలో మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన పైన మీడియా దుష్ప్రచారం చేస్తోందని, నేను అందంగా కనిపించడం తనకు దేవుడు ఇచ్చిన బహుమతి అన్నారు. తన పైన హాట్ ఎమ్మెల్యే అని అనడాన్ని ఆమె తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications