నాలుగేళ్ల చిన్నారిపై 8 వీధి కుక్కల దాడి (ఫొటోలు)
హైదరాబాద్: హైదరాబాదులో కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట పడడం లేదు. ఇంటి ముందు అడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై సుమారు 8 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి.
కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లాలో నివసించే సంపత్ దంపతులు జీవనోపాధి కోసం నిజాంపేటకొచ్చి జీవిస్తున్నారు.
సంపత్ కుమారుడు యశ్వంత్ ఆలియాస్ చరణ్ (4) ఉదయం ఇంటి ముందు అడుకుంటుండగా 8 వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖం, తల, పొట్టభాగం, వీపు వెనుక తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం ఫీవర్ ఆసుపత్రికి తరలించారు.

కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి
చిన్నారి యశ్వంత్ వైద్యనిపుణులు వ్యాక్సిన్ ఇచ్చి, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

27 కుక్కకాటు కేసులు
27 కుక్కకాటు కేసులు నమోదుగా కాగా పది సంవత్సరాల లోపువారు ఆరుగురు ఉన్నారు. యశ్వంత్ తండ్రి సంపత్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

అధికారుల హడావిడి
శుక్రవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ సిబ్బంది హడావుడిగా వచ్చి ప్రశాంతినగర్‌లో కుక్కలు పట్టటం మొదలుపెట్టారు. వీరి చర్య పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేస్తున్నా...
కాలనీల్లో విపరీతంగా పెరుగుతున్న కుక్కల గురించి నిత్యం ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని అధికారులు ఓ బాలుడి ప్రాణం మీదకు వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా హడావుడి చెయ్యడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications